మాదాపూర్‎లో ఇంట్లోకి దూసుకెళ్లిన కారు

ABN , First Publish Date - 2022-04-24T16:20:24+05:30 IST

మాదాపూర్ సాయి నగర్ లో కారు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన కారు ఇంట్లోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి

మాదాపూర్‎లో ఇంట్లోకి దూసుకెళ్లిన కారు

హైదరాబాద్: మాదాపూర్ సాయి నగర్ లో కారు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన కారు ఇంట్లోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు వెంటనే దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని యువకులను అదుపులోకి తీసుకున్నారు. యువకులు మద్యం మత్తులో కారు డ్రైవింగ్ చేసినట్లు పోలీసు తెలిపారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Read more