Chikoti Praveen: ఈడీకి పూర్తి ఆధారాలు ఇచ్చా
ABN , First Publish Date - 2022-08-04T04:15:38+05:30 IST
క్యాసినో (Casino) వ్యవహారంలో చికోటి ప్రవీణ్ (Chikoti Praveen)కు ఈడీ విచారణ జరిగింది. సుమారు 10 గంటల పాటు చికోటిని అధికారులు...

హైదరాబాద్ (Hyderabad): క్యాసినో (Casino) వ్యవహారంలో చికోటి ప్రవీణ్ (Chikoti Praveen)కు మూడో రోజు ఈడీ విచారణ జరిగింది. సుమారు 10 గంటల పాటు చికోటిని అధికారులు ప్రశ్నించారు. విచారణ ముగిసిన అనంతరం చికోటి ప్రవీణ్ మాట్లాడుతూ.. ఈడీ అధికారులు అడిగిన వాటికి సమాధానం చెప్పానన్నారు. హవాలా రూపంలో డబ్బు మళ్లించానో లేదో ఈడీ అధికారులకు పూర్తి ఆధారాలు ఇచ్చానని చెప్పారు. తాను క్యాసినో ఆడిపిస్తున్నాడని.. గోవా(Gao)లో క్యాసినో లీగల్ అని తెలిపారు. క్యాసినో ఆడేందుకు వస్తున్నవాళ్లను తానెందుకు అడ్డుకుంటానన్నారు.
‘‘క్యాసినో ఆడవద్దని కొందరికి చెప్పా.. వాళ్ల ఇష్టంతో ఆడుతున్నారు. చాలామంది నాపై చేతకాని ఆరోపణలు చేస్తున్నారు. కొందరు సోషల్‌మీడియాలో నన్ను టార్గెట్ చేస్తున్నారు. నాపై థ్రెట్ ఉంది.. ఈ విషయాన్ని ఈడీ అధికారులకు చెప్పా. నేను జంతు ప్రేమికుడిని.. నా దగ్గర ఎలాంటి హానికరమైన జంతువులు లేవు. అన్ని అనుమతులతోనే ఫార్మ్‌హౌస్‌లో జంతువులను పెంచుతున్నా. ఈడీ మళ్లీ విచారణకు హాజరుకావాలన్నా అవుతా.’’ అని చికోటి ప్రవీణ్ తెలిపారు.