Hyderabad: జీతం డబ్బు కోసం గొడవ.. భర్త ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-10-07T12:58:10+05:30 IST

జీతం డబ్బుల కోసం భార్యతో గొడవపడి ఓ భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మల్కాజిగిరి పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో బుధవారం అ

Hyderabad: జీతం డబ్బు కోసం గొడవ.. భర్త ఆత్మహత్య

హైదరాబాద్/మల్కాజిగిరి: జీతం డబ్బుల కోసం భార్యతో గొడవపడి ఓ భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్‌ పరిధిలో బుధవారం అర్ధరాత్రి తర్వాత జరిగింది. ఆనంద్‌బాగ్‌కు చెందిన మోర సంతో్‌షకుమార్‌ (30) ఆటో డ్రైవర్‌. ఆరుమాసాల క్రితం సంతోష్‌ నేరేడ్‌మెట్‌ కాకతీయనగర్‌కు చెందిన శ్రీలత (23)ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. శ్రీలత ప్రైవేటు ఉద్యోగి.  గత నెల 27న శ్రీలత జీతం విషయంలో భార్యాభర్తలిద్దరూ గొడవ పడ్డారు. ఆరోజు శ్రీలత తనపుట్టింటికి వెళ్లిపోయింది. అదేరోజు సంతోష్‌ కూడా అక్కడికి వెళ్లి భార్యతో తగువుపడ్డాడు. ఈ విషయంపై నేరేడ్‌మెట్‌ పోలీ్‌సస్టేషన్‌లో శ్రీలత ఫిర్యాదు చేసింది. దసరా సందర్భంగా సంతోష్‌ తన ఇంట్లో కుటుంబీకులతో కలిసి సరదాగా గడిపాడు. రాత్రి అందరూ నిద్రపోయాక తన బెడ్‌రూంకెళ్లి ఉరేసుకున్నాడు. ఉదయం చూసే సరికి సంతోష్‌ ఉరేసుకుని కనిపించాడు. ఈ మేరకు సంతోష్‌ తల్లి కళమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నారు.  

Updated Date - 2022-10-07T12:58:10+05:30 IST