తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి ఆంధ్రాలో ఓటు ఎలా అడుగుతారు?: బక్కని

ABN , First Publish Date - 2022-10-07T08:33:54+05:30 IST

తెలంగాణ రాష్ట్ర సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ పేరుతో ఆంధ్రాకు వెళ్లి ఓటు ఎలా అడుగుతారని టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు ప్రశ్నించారు.

తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి ఆంధ్రాలో ఓటు ఎలా అడుగుతారు?: బక్కని

షాద్‌నగర్‌అర్బన్‌, అక్టోబరు 6: తెలంగాణ రాష్ట్ర సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ పేరుతో ఆంధ్రాకు వెళ్లి ఓటు ఎలా అడుగుతారని టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు ప్రశ్నించారు. అధికార కాంక్షతో కేసీఆర్‌ ఆంధ్రాపై, ఆ ప్రాంత నాయకత్వంపై పలు ఆరోపణలు చేశారని గుర్తుచేశారు. రెండు రాష్ట్రాలతో ముడిపడిన సాగునీటి సమస్య, ఉద్యోగుల విభజన లాంటి సమస్యలను పరిష్కరించకుండా ఆంధ్రాకు ఎలా వెళ్తారని ప్రశ్నించారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా దేశ రాజకీయాలను శాసిస్తానంటే ప్రజలు ఎలా నమ్ముతారని బక్కని ప్రశ్నించారు. 

Updated Date - 2022-10-07T08:33:54+05:30 IST