gorantla madhav video: మాధవ్‌పై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పరువు నష్టం దావా
ABN , First Publish Date - 2022-08-11T00:06:08+05:30 IST
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ (Hindupur mp Gorantla Madhav) పై న్యాయ చర్యలకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ...

హైదరాబాద్: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ (Hindupur mp Gorantla Madhav)పై న్యాయపరమైన చర్యలకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (Abn Andhrajyothy) సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ (Vemuri Radha Krishna) సిద్ధమయ్యారు. రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేయనున్నారు. క్రిమినల్, పరువు నష్టం చర్యలు తీసుకోవాలని కోరనున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో (telugu states news) తీవ్ర కలకలం సృష్టించిన ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో (gorantla madhav video) ఒరిజినల్ కాదంటూ అనంతపురం ఎస్పీ ఫకీరప్ప (anantapur sp pakkirappa) మీడియా సమావేశంలో ప్రకటించిన తర్వాత మాధవ్ కూడా ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణను (ABN RK) దుర్భాషలాడారు. ఈ వ్యాఖ్యలను వేమూరి రాధాకృష్ణ సీరియస్‌గా తీసుకున్నారు. దీంతో చర్యలకు రెడీ అయ్యారు.