BJP ఆఫీస్‌ వద్ద అనుమానాస్పద Car.. దానిలో సూట్ కేసు.. క్షణాల్లో చేరుకున్న Bomb Squad.. చివరకు ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-08-16T20:17:30+05:30 IST

అసలే మునుగోడు ఉప ఎన్నిక(Munugode bypoll) పుణ్యమాని పార్టీల మధ్య పెద్ద దుమారమే రేగుతోంది.

BJP ఆఫీస్‌ వద్ద అనుమానాస్పద Car.. దానిలో సూట్ కేసు.. క్షణాల్లో చేరుకున్న Bomb Squad.. చివరకు ఏం జరిగిందంటే..

Hyderabad : అసలే మునుగోడు ఉప ఎన్నిక(Munugode bypoll) పుణ్యమాని పార్టీల మధ్య పెద్ద దుమారమే రేగుతోంది. తెలంగాణ(Telangana)లోని మూడు ముఖ్య పార్టీలు టీఆర్ఎస్(TRS), కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP) మాటల బాణాలతో రెచ్చిపోతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల(Assembly Elections)కు మునుగోడు ఉపఎన్నిక కీలకం కావడంతో మూడు పార్టీలు చావో రేవో అన్నట్టుగా ఉపఎన్నికను తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కడ ఏది కనిపించినా కూడా అనుమానాస్పదంగా చూడాల్సి వస్తోంది. నేడు బీజేపీ ఆఫీస్‌(BJP Office) ఎదుట ఒక కారు కనిపించింది. మహారాష్ట్ర నంబర్‌(Maharastra Number)తో రెండ్రోజులుగా నానో కారు అక్కడే ఉంటోంది. నానో కారులో పెద్ద సూట్‌కేసును సైతం బీజేపీ కార్యకర్తలు గుర్తించారు. ఇంకేముంది? ఏదో జరిగిపోతోందంటూ రచ్చ రచ్చ. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బాంబు స్క్వాడ్‌(Bomb Squad)తో సహా పోలీసులు బీజేపీ కార్యాలయం వద్ద వాలిపోయారు. 


క్షణాల్లో మీడియా కూడా బీజేపీ కార్యాలయం వద్దకు చేరిపోయింది. ఏం జరుగుతుందో ఏమోనన్న ఉత్కంఠ. కారులోని సూట్ కేసులో బాంబ్ ఉంటుందన్న అనుమానం. అయితే కారులో ఏమీ లేదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాసేపటికే బీజేపీ కార్యాలయం ముందు పార్క్ చేసిన కారుకు సంబంధించిన ఓనర్ వచ్చారు. ట్విస్ట్ ఏంటంటే.. కారులో ఉన్న సూట్ కేస్‌లో బట్టలు మాత్రమే ఉన్నట్టు గుర్తించారు. బీజేపీ కార్యాలయం పక్క కాలనీలో ఉండే వ్యక్తి ఇక్కడ కార్ పార్క్ చేశాడని నిర్దారణ అయింది. ఇన్వెస్టగేషన్ కోసం కారును, కారు ఓనర్‌ను అబిడ్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇక్కడ పార్క్ చేయడానికి కారణాలు, ఏమైనా కుట్ర ఉన్నదా అనే కోణంలో అనుమానంతో కారు ఓనర్‌ను విచారించారు. 


Updated Date - 2022-08-16T20:17:30+05:30 IST