heavy rain: హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం

ABN , First Publish Date - 2022-09-29T02:55:49+05:30 IST

నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, పంజాగుట్ట, ఎల్బీనగర్, వనస్థలిపురం

heavy rain: హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం

హైదరాబాద్: నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, పంజాగుట్ట, ఎల్బీనగర్, వనస్థలిపురం, బి.యన్.రెడ్డినగర్, నాగోల్, చైతన్యపురి, కొత్తపేట, హయత్నగర్, పెద్దఅంబర్పేట, చంపాపేట, సరూర్నగర్, సైదాబాద్ భారీ వర్షం పడింది. ఎల్బీనగర్ చౌరస్తా నుంచి 4 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో నిలిచిపోయిన విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మళ్లీ మొదలైన మాయదారి వాన రాష్ట్రాన్ని వదలడం లేదు. మంగళవారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షం పడింది. ప్రభావిత ప్రాంతాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పట్టణ ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. 


మరో రెండ్రోజులు వానే 

రాష్ట్రంలో బుధ, గురువారాల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని హైదరాబాద్‌లోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సోమవారం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాలలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం మంగళవారం కూడా కొనసాగిందని.. ఈ క్రమంలో సముద్ర మట్టానికి 3.1 కిమీ ఎత్తు వరకు వ్యాపించిందని సంచాలకులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీని ప్రభావంతో రెండ్రోజులపాటు తేలికపాటి, మోస్తరు, భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపారు.

Read more