ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2022-10-24T00:03:00+05:30 IST

రంగారెడ్డి జిల్లా ప్రజలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి దీపావళి శుభాకాంక్షలు

ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు

రంగారెడ్డి అర్బన్‌, అక్టోబరు 23 : రంగారెడ్డి జిల్లా ప్రజలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి పండగ ప్రజల జీవితాల్లో మరిన్ని ప్రగతి కాంతులు నింపాలని కోరుకున్నారు. చీకట్లను పారద్రోలి వెలుగులను నింపే పండగను ప్రతిఒక్కరూ జాగ్రత్తగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా జరుపుకోవాలన్నారు.

అదేవిధంగా జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ జిల్లా ప్రజలకు దీపావళి పండగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరి జీవితాల్లో కష్టాలు అనే కారుచీకట్లు తొలగిపోయి.. చిరుదివ్వెల వెలుగులు నిండాలని ఆకాంక్షించారు. ప్రమాదాలకు తావులేకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఇంటిల్లిపాది పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆయన కోరారు.

Updated Date - 2022-10-24T00:03:15+05:30 IST