Hanmakonda కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత
ABN , First Publish Date - 2022-06-01T16:57:45+05:30 IST
జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది.

హనుమకొండ: జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. బుధవారం ఉదయం కలెక్టరేట్ వద్ద సీపీఎం(CPM) ఆధ్వర్యంలో మహాధర్నాకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో సీపీఎం కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. మహిళలు ఎర్రటిఎండలో రోడ్డుపై బైఠాయించారు. కాగా... ధర్నాకు వస్తున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, మరోనేత పోతినేని సుదర్శన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.