హనుమకొండ ఇన్‌చార్జి డీఈవోగా వాసంతి

ABN , First Publish Date - 2022-10-01T05:06:06+05:30 IST

హనుమకొండ ఇన్‌చార్జి డీఈవోగా వాసంతి

హనుమకొండ ఇన్‌చార్జి డీఈవోగా వాసంతి
డీఈవో వాసంతికి శుభాకాంక్షలు తెలుపుతున్న ఉద్యోగులు

హనుమకొండ రూరల్‌, సెప్టెంబరు 30: హనుమకొండ జిల్లా విద్యాశాఖాధికారి బి.రంగయ్యనాయుడు వ్యక్తిగత కారణాలతో సెలవుపై వెళ్లిన నేపథ్యంలో... వరంగల్‌ డీఈవో వాసంతిని హనుమకొండ ఇన్‌చార్జి డీఈవోగా నియమిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. రంగయ్యనాయుడు తిరిగి విధుల్లో చేరే వరకు ఆమె కొనసాగుతారని ఉత్తర్వులో పేర్కొన్నారు. కాగా, నూతనంగా బాధ్యతలు చేపట్టిన వాసంతిని డీఈవో కార్యాలయ అధికారులు, సిబ్బందితో పాటు టీఎన్‌జీవో అసోసియేషన్‌ విద్యాశాఖ ఫోరం బాధ్యులు కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

Read more