ప్రజావాణి దరఖాస్తుల వెల్లువ

ABN , First Publish Date - 2022-10-18T04:54:43+05:30 IST

ప్రజావాణి దరఖాస్తుల వెల్లువ

ప్రజావాణి దరఖాస్తుల వెల్లువ
గ్రీవెన్స్‌లో ఫిర్యాదులు స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్‌ బి. గోపి

 వరంగల్‌ కలెక్టరేట్‌, అక్టోబరు 17: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో తమ సమస్యలపై జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించిన సమస్యలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్‌ బి.గోపి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌హాల్‌లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో 58 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఎంపీడీసీ ఒకటి, గ్రేటర్‌ మునిసిపల్‌ మూడు, పోలీసు శాఖ మూడు, డీఆర్‌డీవో మూడు, ఎంజీఎం ఐదు, విద్యాశాఖ రెండు, ఆర్‌ అండ్‌ బీ ఒకటి, పంచాయతీరాజ్‌ ఏడు, వైద్య శాఖ రెండు, ఇరిగేషన్‌ రెండు, ఎస్సీ కార్పొరేషన్‌ రెండు, డీడబ్ల్యూవో ఒకటి, ఆర్‌డీవో రెండు, మైనారిటీ ఒకటి దరఖాస్తులు వచ్చాయి. అదనపు కలెక్టర్లు కె.శ్రీవత్స, బి.హరిసింగ్‌, డీఆర్‌డీవో పీడీ సంపత్‌రావు, ఆర్‌డీవో మహేందర్‌జీ పాల్గొన్నారు.

రేషన్‌ బియ్యం సరఫరా ఆగింది..

జిల్లా వ్యాప్తంగా 50 శాతం పైగా రేషన్‌ షాపుల కు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ బియ్యం మొదటి విడు త ఈ రోజు వరకు విడుదల కాలేదని ప్రభుత్వం వెం టనే కోట విడుదల చేసి బియ్యం సరఫరా చేయాలని రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం కోరింది. కలెక్టర్‌ కు ఈ సందర్భంగా వినతి పత్రాన్ని అందజేశారు. కొన్నిషాపుల్లో సన్నబియ్యం, మరికొన్ని దొడ్డు బియ్యం కావడం వలన లబ్ధిదారులకు సరియైున న్యాయం చే యలేకపోతున్నామని ప్రతీ ఒక్కరు కూడా సన్నరకం బియ్యం కావాలంటూ రేషన్‌ డీలర్లతో గొడవలు పడుతున్నారని చెప్పారు. మంద భారతి, రామా చందర్‌, గోపన్న, వెంకటనారాయణ, మల్లారెడ్డి, వెంకట్రావ్‌, శ్రీనివాస్‌, కుమారస్వామి, వీరస్వామి పాల్గొన్నారు.

మా భూములు మాకు ఇప్పించండి..

ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా తమకు అందజేసిన ప్ర భుత్వ భూమిని కౌలు పేరుతో  కబ్జా చేశారని, తమ భూమి తమకు తిరిగి ఇచ్చేలా కలెక్టర్‌ చర్యలు తీసుకోవాలని దౌలత్‌నగర్‌కు చెందిన దళిత మహిళా రైతులు కోరారు. గ్రీవెన్స్‌ సందర్భంగా పర్వతగిరి మండలం దౌలత్‌ నగర్‌కు చెందిన 40 మంది మహిళలు కలెక్టర్‌ను కలిసి తమ భూమి ఆక్రమణకు గురైందని వెంటనే తమ భూమిని తమకు అప్పగించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. 



Updated Date - 2022-10-18T04:54:43+05:30 IST