Hyderabad Metro Rail: హైదరాబాద్ మెట్రోరైలు సెకండ్ ఫేజ్‌కు గ్రీన్‌సిగ్నల్
ABN , First Publish Date - 2022-11-27T16:00:19+05:30 IST
హైదరాబాద్ మెట్రోరైలు (Hyderabad Metro Rail) సెకండ్ ఫేజ్‌కు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నలిచ్చింది. శంషాబాద్ (Shamshabad) ఎయిర్‌పోర్టు వరకు మెట్రోరైలు విస్తరించనున్నారు.
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోరైలు (Hyderabad Metro Rail) సెకండ్ ఫేజ్‌కు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నలిచ్చింది. శంషాబాద్ (Shamshabad) ఎయిర్‌పోర్టు వరకు మెట్రోరైలు విస్తరించనున్నారు. మైండ్‌స్పేస్ జంక్షన్ (Mindspace Junction) నుంచి శంషాబాద్‌కు మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. 31 కిలోమీటర్ల మేర చేపట్టే మెట్రో నిర్మాణానికి రూ. 6,250 కోట్లు ఖర్చు చేస్తారు. మెట్రో సెకండ్ ఫేజ్‌కు డిసెంబర్ 9న సీఎం కేసీఆర్ (CM KCR) శంకుస్థాపన చేస్తారు. మెట్రోరైలు సెకండ్ ఫేజ్ వివరాలను మంత్రి కేటీఆర్ ట్వీట్‌లో పంచుకున్నారు.
మెట్రోరైలు మొదటి దశను నవంబర్ 2017లో నాగోల్ - అమీర్‌పేట - మియాపూర్ మార్గంతో ప్రారంభించారు. తరువాత ఎల్‌బీ నగర్-అమీర్ పేట మార్గం అక్టోబర్ 2018లో ప్రారంభించారు. అమీర్ పేట -హైటెక్ సిటీ మార్గం మార్చి 2019న ప్రారంభించారు. ఆ తర్వాత 2020 ఫిబ్రవరి 7న బీఎస్-ఎంజీబీఎస్ మార్గం అందుబాటులోకి వచ్చింది. ఈ మార్గం ప్రారంభంతో మెట్రో మొదటి దశలో 72 కిలోమీటర్లకు గాను 69 కిలోమీటర్ల మార్గం అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ మెట్రో దేశంలో రెండవ పెద్ద మెట్రోగా గుర్తింపుపొందింది.