ఘనంగా అమితకుమార్‌రెడ్డి జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2022-12-31T23:47:01+05:30 IST

శాసనమండలి చైర్మన గుత్తా సుఖేందర్‌రెడ్డి తనయుడు గుత్తా వెంకట్‌రెడ్డి మెమోరియల్‌ ట్రస్ట్‌ చైర్మన గుత్తా అమితకుమార్‌రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.

ఘనంగా అమితకుమార్‌రెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా అమితకుమార్‌రెడ్డి జన్మదిన వేడుకలు

రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు

అమితకు శుభాకాంక్షలు తెలిపిన నేతలు, అభిమానులు

నల్లగొండ, డిసెంబరు 31: శాసనమండలి చైర్మన గుత్తా సుఖేందర్‌రెడ్డి తనయుడు గుత్తా వెంకట్‌రెడ్డి మెమోరియల్‌ ట్రస్ట్‌ చైర్మన గుత్తా అమితకుమార్‌రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమితకుమార్‌రెడ్డికి నూతన సంవత్సరం శుభాకాంక్షలతో పాటు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలిపారు. ఈ సందర్భంగా రక్తదాన, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా కేక్‌ను కట్‌ చేసి మిఠాయిలను పంపిణీ చేసి శాలువాలతో సత్కరించి పుష్పగుచ్ఛాలను అందజేసి అమితకు శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు గుత్తా సుఖేందర్‌రెడ్డి నివాసం ఎదుట గుత్తా అమిత పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని బాణసంచా కాల్చారు. అమితరెడ్డి రక్తదానం చేయగా అభిమానులు కూడా అధిక సంఖ్యలో రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణంలోని లెప్రసీ హెల్త్‌ సెంటర్‌లో రోగుల మధ్య అమిత జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్త్‌ సెంటర్‌కు అమిత రూ.3.75 లక్షల చెక్కును విరాళంగా అందజేశారు. అదేవిధంగా రోగులకు రెండు ట్రై సైకిళ్లను వారం రోజుల్లో అందజేస్తానని హామీ ఇచ్చారు. హెల్త్‌ సెంటర్‌లో అమితరెడ్డి తన సతీమణితో కలిసి స్వయంగా భోజనాలు వడ్డించారు. పలువురు స్నేహితులు అమితరెడ్డిని గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా గుత్తా అమితరెడ్డి మాట్లాడుతూ తన తండ్రి బాటలో నడుస్తానని ఆయన మాదిరిగానే జిల్లాలో ప్రజలకు సేవలందిస్తానని పేర్కొన్నారు. గుత్తా వెంకట్‌రెడ్డి మెమోరియల్‌ ట్రస్ట్‌ తరుపున సేవలను అందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎలాంటి బాధ్యతలు అప్పగించినా సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా పార్టీ బలోపేతం కోసం, గెలుపు కోసం కృషి చేస్తానన్నారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో జడ్పీ చైర్మన బండా నరేందర్‌రెడ్డి, జడ్పీ ఫ్లోర్‌లీడర్‌ పాశం రాంరెడ్డి, జడ్పీటీసీ చిట్ల వెంకటేశం, బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు పిల్లి రామరాజుయాదవ్‌, బీఆర్‌ఎస్‌ నాయకుడు యామ దయాకర్‌, నాయకులు యామ కవిత, మాలె శరణ్యారెడ్డి, మునాస వెంకట్‌, బషీర్‌, దుబ్బ అశోక్‌ సుందర్‌, పాశం సంపతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T23:47:02+05:30 IST