ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2022-12-31T00:57:58+05:30 IST

మూడు రోజుల్లో ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని అదనపు కలెక్ట ర్‌ భాస్కర్‌రావు ధాన్యం కొనుగోలు నిర్వాహకులను ఆదేశించారు. దే వరకొండ, పెద్దఅడిశర్లపల్లి, డిండి మండలాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. రైతులను ఇబ్బందులుపెట్టకుండా వేగవంతంగా కొనుగోలు చేయాలన్నారు.

 ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలి
కేంద్రం నిర్వాహకులతో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు

ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలి

కొనుగోళ్లలో అలసత్వంపై అదనపు కలెక్టర్‌ ఆగ్రహం

దేవరకొండ, పెద్దఅడిశర్లపల్లి, డిండి, డిసెంబరు 30: మూడు రోజుల్లో ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని అదనపు కలెక్ట ర్‌ భాస్కర్‌రావు ధాన్యం కొనుగోలు నిర్వాహకులను ఆదేశించారు. దే వరకొండ, పెద్దఅడిశర్లపల్లి, డిండి మండలాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. రైతులను ఇబ్బందులుపెట్టకుండా వేగవంతంగా కొనుగోలు చేయాలన్నారు. పీఏపల్లి మండలంలోని అంగడిపేట ఎక్స్‌రోడ్డు వద్ద పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం రాశులు కుప్ప లు కుప్పలుగా ఉండటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు ఎందుకు ఆలస్యం అవుతుందని నిర్వాహకులపై ప్రశ్నిం చారు. త్వరగా రైతులతో మాట్లాడి తేమ లేకుండా ధాన్యం కొనుగోలు చే యాలని అన్నారు. జిల్లాలో 270 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండ గా 226 కేంద్రాలను మూసివేసినట్లు తెలిపారు. రైతుల వద్ద నుంచి 4లక్షల 1784 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు ఆయ న వెల్లడించారు. అనంతరం డిండి మండలంలోని టి.గౌరారం, చె ర్కుపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఆయన వెం ట డీఎస్వో వెంకటేశ్వర్లు, జిల్లా మేనేజర్‌ నాగేశ్వర్‌రావు, పీఏసీఎస్‌ చై ర్మన వల్లపురెడ్డి, సీఈవో వెంకటేశ్వరరెడ్డి, డిండి సొసైటీ చైర్మన శ్రీనివాసరావు, డీసీవో రాజేందర్‌రెడ్డి, ఎండి.అయూబ్‌, వసీం, అబీబ్‌, బా ల్‌రెడ్డి, అంతిరెడ్డి తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-12-31T00:58:00+05:30 IST

Read more