సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్న గవర్నర్

ABN , First Publish Date - 2022-02-19T22:11:57+05:30 IST

మేడారం సమ్మక్క-సారలమ్మను గవర్నర్ తమిళిసై దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు నిలువెత్తు బంగారం

సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్న గవర్నర్

మేడారం: మేడారం సమ్మక్క-సారలమ్మను గవర్నర్ తమిళిసై దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు నిలువెత్తు బంగారం(బెల్లం) తమిళిసై సమర్పించారు. గవర్నర్‌కు  ములుగు ఎమ్మెల్యే సీతక్క స్వాగతం పలికారు. అయితే గవర్నర్‌ తమిళిసైకి స్వాగతం పలికేందుకు మంత్రులు రాలేదు. తన రాక సందర్భంగా భక్తులను ఆపడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన ప్రజలందరి సమ్మక్క సారలమ్మ జాతర శుభాకాంక్షలు తెలిపారు. సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న తర్వాత గవర్నర్ మీడియాతో మాట్లాడారు. అమ్మ దీవేనలు ప్రజలందరికీ ఉండాలని కోరుకున్నానని తమిళిసై తెలిపారు. 

Read more