తమ్ముడి కూతురు చనిపోయిందని..

ABN , First Publish Date - 2022-07-08T12:14:44+05:30 IST

తమ్ముడి కూతురు చనిపోయిందన్న వేదనలో ఓ వ్యక్తి ఆస్పత్రి అద్దాలు ధ్వంసం చేశాడు. ఈ క్రమంలో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈసంఘటన సంగారెడ్డిలోని ప్రభుత్వ

తమ్ముడి కూతురు చనిపోయిందని..

సంగారెడ్డి: తమ్ముడి కూతురు చనిపోయిందన్న వేదనలో ఓ వ్యక్తి ఆస్పత్రి అద్దాలు ధ్వంసం చేశాడు. ఈ క్రమంలో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈసంఘటన సంగారెడ్డిలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి ఎంసీహెచ్‌లో గురువారం సాయంత్రం చోటుచేసుకున్నది. ఆస్పత్రి వైద్య సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం హత్నూర మండలం కాసాల గ్రామానికి చెందిన నాయికోటి మిత్ర  ప్రసవం నిమిత్తం సంగారెడ్డి ఎంసీహెచ్‌లో బుధవారం సాయంత్రం చేరింది. ఆస్పత్రి వైద్యులు ప్రసవం చేయగా ఆమెకు ఆడ శిశువు జన్మించింది. పుట్టిన కొద్దిసేపటికే అనారోగ్య కారణాలతో ఆ పసికందు మృతిచెందింది. అయితే విషయం తెలుసుకున్న బాలింత నాయికోటి మిత్ర బావ రమేశ్‌(భర్త అన్న) తీవ్ర వేదనలో గురువారం సాయంత్రం ఆస్పత్రికి వచ్చి ఎంసీహెచ్‌లోని ఆపరేషన్‌ థియేటర్‌ పక్కనున్న అద్దాలను తలతో బలంగా మొదగా, తల, కంటి భాగం వద్ద అద్దం పెంకులు గుచ్చుకొని తీవ్ర రక్తస్రావమైంది. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రి సిబ్బంది అదే ఆస్పత్రిలో చేర్చారు. కంటి కింది భాగం వద్ద తీవ్ర గాయం కావడంతో కుట్లు వేశారు. ఇదే విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అనిల్‌కుమార్‌ను వివరణ కోరగా మద్యం మత్తులో ఉన్నాడని, బాలింతతో పాటు అతనికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని ఆయన తెలిపారు.

Read more