వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ తల్లి రథోత్సవం..

ABN , First Publish Date - 2022-07-07T08:29:55+05:30 IST

బల్కంపేట ఎల్లమ్మ తల్లి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. బుధవారం సాయంత్రం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన రథంపై అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు.

వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ తల్లి రథోత్సవం..

అమీర్‌పేట, ఆంధ్రజ్యోతి : బల్కంపేట ఎల్లమ్మ తల్లి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. బుధవారం సాయంత్రం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన రథంపై అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు. కల్యాణ ఘట్టంలో చివరి అంకమైన ఈ రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ దంపతులు ప్రత్యేక పూజ నిర్వహించి హారతి ఇచ్చి రథోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సాయంత్రం 6.00 గ ంటలకు ఆలయ ప్రాంగణం నుంచి ప్రారంభమైంది.

Read more