మానేరు సుందరీకరణకు టెండర్లు: గంగుల

ABN , First Publish Date - 2022-02-23T09:17:34+05:30 IST

మానేరు రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టు సుందరీకరణ పనులకు టెండర్లు..

మానేరు సుందరీకరణకు టెండర్లు: గంగుల

హైదరాబాద్‌, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): మానేరు రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టు సుందరీకరణ పనులకు టెండర్లు పిలిచినట్లు బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. తొలిదశలో 2.6 కిమీ మేర ప్రతిపాదించిన నిర్మాణాలకు డీపీఆర్‌ పూర్తయిందన్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ. 410 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. మంగళవారం జలసౌధలో ఇరిగేషన్‌, టూరిజం, రెవెన్యూ తదితర శాఖల ఉన్నతాధికారులతో మంత్రి గంగుల కమలాకర్‌ మానేరు రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టుపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.  

Read more