గజ్వేల్ అభివృద్ధి అద్భుతం
ABN , First Publish Date - 2022-02-27T08:23:24+05:30 IST
సినీనటుడు ప్రకాశ్‌రాజ్ శనివారం గజ్వేల్ నియోజకవర్గాన్ని సందర్శించారు. గజ్వేల్ పట్టణంలోని సమీకృత మార్కెట్, వైకుంఠధామం, మహతీ ఆడిటోరియం, మల్లన్నసాగర్
కేసీఆర్ ఆలోచనలకు ప్రతిరూపం
విదేశాల్లో పర్యటించినట్లు ఉంది: ప్రకాశ్‌రాజ్
గజ్వేల్/తొగుట, ఫిబ్రవరి 26 : సినీనటుడు ప్రకాశ్‌రాజ్ శనివారం గజ్వేల్ నియోజకవర్గాన్ని సందర్శించారు. గజ్వేల్ పట్టణంలోని సమీకృత మార్కెట్, వైకుంఠధామం, మహతీ ఆడిటోరియం, మల్లన్నసాగర్ ఆర్‌అండ్‌ఆర్ కాలనీ, కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆలోచనలు అభివృద్ధి రూపంలో గజ్వేల్‌లో ప్రతిబింబిస్తున్నాయని ప్రశంసించారు. దేశానికే ఆదర్శంగా గజ్వేల్ అభివృద్ధి చెందిందని, విదేశాల్లో పర్యటించిన అనుభూతి కలిగిందని చెప్పారు. ఆయనకు గజ్వేల్ ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ, మునిసిపల్ చైర్మన్ ఎన్‌సీ రాజమౌళి తదితరులు స్వాగతం పలికారు. అనంతరం తొగుట మండలం శివారులో 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన మల్లన్న సాగర్‌ను ప్రకాశ్‌రాజ్ సందర్శించారు. పంపుహౌ్‌సలోకి వెళ్లి అక్కడ నీటిని ఎత్తిపోస్తున్న బాహుబలి మోటార్లను పరిశీలించారు. మల్లన్న సాగర్ కట్టపైకి చేరుకుని డెలివరీ సిస్టర్నుల నుంచి వస్తున్న గోదావరి నీటిని చూిసి పులకించిపోయారు.