Komati Reddy: టీపీసీసీ కార్యవర్గం నుంచి.. కోమటిరెడ్డి ఔట్‌

ABN , First Publish Date - 2022-12-11T03:22:01+05:30 IST

కాంగ్రెస్‌ అధిష్ఠానం ఎట్టకేలకు టీపీసీసీ కార్యవర్గాన్ని విస్తరించింది. ఏకంగా 24 మంది ఉపాధ్యక్షులు, 84 మంది ప్రధాన కార్యదర్శులు, 40 మంది ఎగ్జిక్యూటివ్‌ సభ్యులతో జంబో కార్యవర్గాన్ని నియమించింది.

Komati Reddy: టీపీసీసీ కార్యవర్గం నుంచి..   కోమటిరెడ్డి ఔట్‌

రాజకీయ వ్యవహారాల కమిటీలోనూ నై

ఏ కమిటీలోనూ చోటివ్వని అధిష్ఠానం

22 మందితో పీఏసీ నియామకం

రేవంత్‌ అధ్యక్షతన ఎగ్జిక్యూటివ్‌ కమిటీ

అందరి అభిప్రాయాలకూ

ప్రాధాన్యమిచ్చిన హైకమాండ్‌

24 మంది ఉపాధ్యక్షులు, 84 మంది

ప్రధాన కార్యదర్శులతో భారీ కార్యవర్గం

మొత్తంగా 180 దాటిన సభ్యుల సంఖ్య

26 డీసీసీ అధ్యక్షుల భర్తీ.. 9 పెండింగ్‌

పలు జిల్లాల అధ్యక్షుల మార్పు

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ అధిష్ఠానం ఎట్టకేలకు టీపీసీసీ కార్యవర్గాన్ని విస్తరించింది. ఏకంగా 24 మంది ఉపాధ్యక్షులు, 84 మంది ప్రధాన కార్యదర్శులు, 40 మంది ఎగ్జిక్యూటివ్‌ సభ్యులతో జంబో కార్యవర్గాన్ని నియమించింది. దీంతోపాటు 18 మంది సభ్యులు, నలుగురు ఆహ్వానితులతో నూతన రాజకీయ వ్యవహారాల కమిటీని కూడా ఏర్పాటు చేసింది. రానున్న ఎన్నికలను ఎదుర్కొనే కమిటీ కావడంతో పార్టీ నేతలందరి సూచనల్నీ పరిగణనలోకి తీసుకుని శనివారం ఈ నియామకాలు చేపట్టింది. వీరితోపాటు 26 డీసీసీలకు అధ్యక్షులనూ నియమించింది. తొమ్మిది డీసీసీలకు అధ్యక్షుల నియామకాన్ని మాత్రం పెండింగ్‌లో పెట్టింది. కాగా, మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించిన సీనియర్‌ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి కొత్త కార్యవర్గంలో మెండి చెయ్యి చూపించింది. పైగా కీలక నిర్ణయాలు తీసుకునే రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) నుంచి కూడా ఆయనను తప్పించింది. పార్టీ ముఖ్యనేతలందరికీ ఏదో ఒక కమిటీలో చోటు దక్కినా.. కోమటిరెడ్డికి మాత్రం ఏ కమిటీలోనూ స్థానం కల్పించలేదు. తద్వారా ఏ స్థాయి నేతలైనా క్రమశిక్షణ మీరితే పక్కన పెట్టేస్తామనే సంకేతాన్ని ఇచ్చింది.

పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయిలో విధానపరమైన నిర్ణయాలు తీసుకునే పీఏసీని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌ చైర్మన్‌గా అధిష్ఠానం ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, పీసీసీ మాజీ అధ్యక్షులు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రులు జానారెడ్డి, గీతారెడ్డి, జీవన్‌రెడ్డి, షబ్బీర్‌ అలీ, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, కేంద్ర మాజీ మంత్రులు రేణుకా చౌదరి, బలరాం నాయక్‌, ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్‌, ఏఐసీసీ కార్యదర్శులు చిన్నారెడ్డి, శ్రీధర్‌బాబు, వంశీచంద్‌రెడ్డి, సంపత్‌కుమార్‌లను సభ్యులుగా నియమించారు. అలాగే టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు అజరుద్దీన్‌, అంజన్‌కుమార్‌ యాదవ్‌, జగ్గారెడ్డి, మహేశ్‌కుమార్‌గౌడ్‌లను పీఏసీకి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. గత పీఏసీకి ఉన్న కన్వీనర్‌ పోస్టును తొలగించారు.

40 మందితో ఎగ్జిక్యూటివ్‌ కమిటీ..

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి అధ్యక్షతన 40 మంది ముఖ్య నేతలతో కొత్తగా ఎగ్జిక్యూటివ్‌ కమిటీని అధిష్ఠానం నియమించింది. మాణిక్కం ఠాగూర్‌ మినహా పీఏసీ సభ్యులందరూ ఈ కమిటీలో ఉన్నారు. వారు కాకుండా.. సీనియర్‌ నేతలు పి.సుదర్శన్‌రెడ్డి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, సంభాని చంద్రశేఖర్‌, నాగం జనార్దన్‌రెడ్డి, గడ్డం ప్రసాద్‌కుమార్‌, సి.రామచంద్రారెడ్డి, కొండా సురేఖ, జి.వినోద్‌, సీతక్క, పొదెం వీరయ్య, జెట్టి కుసుమ్‌కుమార్‌, ఆలేటి మహేశ్వర్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు, పొన్నం ప్రభాకర్‌, కోదండరెడ్డి, ఈరవత్రి అనిల్‌కుమార్‌, వేం నరేందర్‌రెడ్డి, మల్లు రవి, సయ్యద్‌ అజ్మతుల్లా హుస్సేనీకి ఈ కమిటీలో చోటు కల్పించారు. గతంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు కలిసి ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరించగా.. ఈసారి రేవంత్‌ అధ్యక్షతన ఎగ్జిక్యూటివ్‌ కమిటీని అధిష్ఠానం నియమించడం గమనార్హం. ఇక ఇప్పటికే కొత్తగా 24 మంది ఉపాధ్యక్షులను నియమించడంతో ఇప్పటికే ఉన్న పది మంది సీనియర్‌ ఉపాధ్యక్షులను కలుపుకొని ఈ సంఖ్య 34కు చేరినట్లయింది. కొత్తగా ఉపాధ్యక్షులుగా మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్‌ పద్మావతీరెడ్డి, బండ్రు శోభా భాస్కర్‌, కొండ్రు పుష్పలీల, నేరెళ్ల శారద గౌడ్‌, సీహెచ్‌ విజయరమణరావు, చామల కిరణ్‌రెడ్డి, చెరుకు సుధాకర్‌గౌడ్‌, దొమ్మాటి సాంబయ్య, శ్రవణ్‌ కుమార్‌రెడ్డి, ఎర్ర శేఖర్‌, జీ వినోద్‌, గాలి అనిల్‌కుమార్‌, మదన్‌ మోహన్‌రావు, మల్‌రెడ్డి రంగారెడ్డి, ఎంఆర్‌జీ వినోద్‌ రెడ్డి, ఒబెదుల్లా కొత్వాల్‌, పోట్ల నాగేశ్వర్‌రావు, రాములు నాయక్‌, సంజీవరెడ్డి, సిరిసిల్ల రాజయ్య, టి.వజ్రేశ్‌ యాదవ్‌, తాహెర్‌ బిన్‌ రంధానీ నియమితులయ్యారు. ఇప్పటివరకు జరిగిన నియామకాలతో కార్యవర్గ సభ్యుల సంఖ్య 180 దాటింది. దీనికితోడు సంయుక్త కార్యదర్శులు, నియోజకవర్గానికి ఒకరు చొప్పున కార్యదర్శుల నియామకాలు కూడా జరిగితే కార్యవర్గ సభ్యుల సంఖ్య 300 దాటనుంది.

26 డీసీసీలకు అధ్యక్షులు..

రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాలు ఉండగా.. గ్రేటర్‌ హైదరాబాద్‌ డీసీసీని హైదరాబాద్‌, ఖైరతాబాద్‌, సికింద్రాబాద్‌ డీసీసీలుగా విభజించారు. దీంతో మొత్తం 35 డీసీసీలు కాగా, 26 డీసీసీలకు అధ్యక్షులను కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రకటించింది. వరంగల్‌, రంగారెడ్డి, ఖమ్మం, సికింద్రాబాద్‌, సంగారెడ్డి, జనగామ తదితర తొమ్మిది జిల్లాల డీసీసీ అధ్యక్షుల నియామకాన్ని పెండింగ్‌లో పెట్టింది. కాగా 26 డీసీసీల్లో సిరిసిల్ల, మంచిర్యాల, పెద్దపల్లి, మహబూబ్‌నగర్‌, వనపర్తి జిల్లాలకు నూతన అధ్యక్షులను నియమించగా.. మిగిలిన వాటిలో పాతవారినే కొనసాగించింది.

ప్రధాన కార్యదర్శులు వీరే..

ఎ.మధుసూదన్‌ రెడ్డి, అద్దంకి దయాకర్‌, బి.కైలాశ్‌ కుమార్‌, బి.సుభాష్‌ రెడ్డి, భానుప్రకాశ్‌ రెడ్డి, బీర్ల ఐలయ్య, భూతిగళ్ల మహిపాల్‌, బొల్లు కిషన్‌, సీహెచ్‌ బాలరాజు, చలమల కృష్ణారెడ్డి, చల్లా నర్సింహారెడ్డి, చరణ్‌ కౌశిక్‌ యాదవ్‌, చారుగొండ వెంకటేశ్‌, చేర్యాల అంజనేయులు, చిలుక మధుసూదన్‌ రెడ్డి, చిలుక విజయ్‌ కుమార్‌, చిట్ల సత్యనారాయణ, దారాసింగ్‌ తాండూరు, సుధాకర్‌ యాదవ్‌, దుర్గం భాస్కర్‌, ఇ.కొమురయ్య, యడవల్లి కృష్ణ, ఫక్రుద్దీన్‌, ఫిరోజ్‌ ఖాన్‌, గడుగు గంగాధర్‌, జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌, గోమాస శ్రీనివాస్‌, గౌరీశంకర్‌, జనంపల్లి అనిరుధ్‌రెడ్డి, జెరిపాటి జైపాల్‌, కె.నాగేశ్వర్‌ రెడ్డి, కైలాశ్‌ రెడ్డి, కాటం ప్రదీప్‌ కుమార్‌ గౌడ్‌, కొండేటి మల్లయ్య, కోటంరెడ్డి వినయ్‌ రెడ్డి, కోటూరి మానవతారాయ్‌, కుందూరు రఘువీర్‌రెడ్డి, ఎం.నాగేశ్‌ ముదిరాజ్‌, ఎం.వేణుగౌడ్‌, ఎంఏ ఫయీమ్‌, మొగల్‌గుండ్ల జైపాల్‌ రెడ్డి, మహమ్మద్‌ అబ్దుల్‌ ఫయీమ్‌, ఎన్‌.బాలు నాయక్‌, నర్సారెడ్డి భూపతిరెడ్డి, నూతి సత్యనారాయణ, పి.హరికృష్ణ, పి.ప్రమోద్‌ కుమార్‌, పి.రఘువీర్‌ రెడ్డి, పటేల్‌ రమేశ్‌ రెడ్డి, పిన్నింటి రఘునాథ్‌ రెడ్డి, ప్రేమ్‌ లాల్‌, ఆర్‌ లక్ష్మణ్‌ యాదవ్‌, రాజి రెడ్డి నర్సాపూర్‌, రాంగోపాల్‌ రెడ్డి, రంగినేని అభిలాష్‌ రావు, రంగు బాలలక్ష్మి గౌడ్‌, రాపోలు జయప్రకాశ్‌, ఎస్‌ఏ వినోద్‌ కుమార్‌, సంజీవ ముదిరాజ్‌, సత్తు మల్లేశ్‌, సొంటిరెడ్డి పున్నారెడ్డి, శ్రీనివాస్‌ చెకొలేకర్‌, తాటి వెంకటేశ్వర్లు, వల్లె నారాయణ రెడ్డి, వేదమ బొజ్జు, వెన్నం శ్రీకాంత్‌ రెడ్డి, వేర్లపల్లి శంకర్‌, జహీర్‌ లలానీ, భీమగాని సౌజన్య గౌడ్‌, లకావత్‌ ధనవంతి, ఎర్రబెల్లి స్వర్ణ, గండ్ర సుజాత, గోగుల సరిత వెంకటేశ్‌, జువ్వాడి ఇంద్రా రావు, కందాడి జోత్స్న శివా రెడ్డి, కోట నీలిమ, మందుముల్ల రజితా రెడ్డి, మర్సుకోల సరస్వతి, పి.విజయారెడ్డి, పారిజాత నర్సింహా రెడ్డి, రవళీరెడ్డి కూచన, శశికళ యాదవ్‌, సింగరుపు ఇందిర, ఉజ్మా షకీర్‌.

రేవంత్‌ టీమ్‌కు దక్కిన ప్రాధాన్యం

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అనుచరులకు ప్రాధాన్యం గల పదవులు దక్కాయి. ఆయన వెంట నిత్యం ఉండే రోహిన్‌రెడ్డికి ఖైరతాబాద్‌ డీసీసీ అధ్యక్ష పదవి దక్కగా, చామల కిరణ్‌రెడ్డి ఉపాధ్యక్ష పదవిని దక్కించుకున్నారు. హర్కార వేణుగోపాల్‌, మల్‌రెడ్డి రంగారెడ్డి, అద్దంకి దయాకర్‌ తదితరులకు కూడా ప్రాధాన్యం గల పదవులు దక్కాయి. మునుగోడు ఉప ఎన్నికలో పార్టీ టిక్కెట్‌ ఆశించిన చలమల కృష్ణారెడ్డికి ప్రధాన కార్యదర్శి పదవి దక్కింది.

డీసీసీ అధ్యక్షులు వీరే..

సాజిద్‌ ఖాన్‌ - ఆదిలాబాద్‌

పొడెం వీరయ్య - భద్రాద్రి కొత్తగూడెం

ఎన్‌.రాజేందర్‌రెడ్డి - హన్మకొండ

వలీ ఉల్లా సమీర్‌ - హైదరాబాద్‌

ఎ.లక్ష్మణ్‌కుమార్‌ - జగిత్యాల

పటేల్‌ ప్రభాకర్‌ రెడ్డి - జోగులాంబ గద్వాల

కైలాస్‌ శ్రీనివాస్‌ రావు - కామారెడ్డి

కె.సత్యనారాయణ - కరీంనగర్‌

సి.రోహిన్‌ రెడ్డి - ఖైరతాబాద్‌

జె.భరత్‌ చంద్రారెడ్డి - మహబూబాబాద్‌

జి.మధుసూదన్‌ రెడ్డి - మహబూబ్‌నగర్‌

కె. సురేఖ - మంచిర్యాల

టి.తిరుపతి రెడ్డి - మెదక్‌

నందికంటి శ్రీధర్‌ - మేడ్చల్‌ మల్కాజ్‌గిరి

కె.కుమారస్వామి - ములుగు

సి.వంశీకృష్ణ - నాగర్‌కర్నూల్‌

టీ శంకర్‌ నాయక్‌ - నల్లగొండ

శ్రీహరి ముదిరాజ్‌ - నారాయణపేట

ప్రభాకర్‌ రెడ్డి - నిర్మల్‌

మానాల మోహన్‌ రెడ్డి - నిజామాబాద్‌

ఎంఎస్‌ రాజ్‌ ఠాకూర్‌ - పెద్దపల్లి

ఆది శ్రీనివాస్‌ - రాజన్న సిరిసిల్ల

టి.నర్సా రెడ్డి - సిద్దిపేట

టి.రామ్మోహన్‌ రెడ్డి - వికారాబాద్‌

ఎం.రాజేంద్రప్రసాద్‌ యాదవ్‌ - వనపర్తి

కె.అనిల్‌కుమార్‌ రెడ్డి - యాదాద్రి భువననగిరి

Updated Date - 2022-12-11T08:12:55+05:30 IST