Bura narasaiah goud: ఈనెల 19న బీజేపీలో చేరుతా

ABN , First Publish Date - 2022-10-17T18:29:10+05:30 IST

తెలంగాణ రాబోయేది బీజేపీ ప్రభుత్వమే మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు.

Bura narasaiah goud: ఈనెల 19న బీజేపీలో చేరుతా

హైదరాబాద్: తెలంగాణ (Telangana)లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే (BJP government) మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ (Bura narasiah goud) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... ఈనెల 19న అమిత్ షా (Amith shah) సమక్షంలో ఢిల్లీలో‌ బీజేపీ (BJP)లో చేరుతానని స్పష్టం చేశారు. కేసీఆర్‌ (KCR)ను కలవటం‌ టీఆర్ఎస్ నేతల (TRS Leaders)కు ఒక ఉద్యమంలా మారిందని ఎద్దేవా చేశారు. భువనగిరి పార్లమెంట్ అభివృద్ధిలో  కేంద్రం పాత్ర ఉందన్నారు. పార్టీలకు అతీతంగా మోదీ ప్రభుత్వం (Modi government).. అభివృద్ధికి  సహకరించిందని చెప్పుకొచ్చారు. ‘‘నా రాజకీయ జీవితం కోసం కాదు.. రాష్ట్ర భవిష్యత్ కోసమే బీజేపీలో చేరుతున్నాను’’ అని అన్నారు. ఫైర్ బ్రాండ్ బండి సంజయ్ (?Bandi sanjay), నడ్డా (Nadda), అమిత్ షాలు ఆహ్వానం మేరకు బీజేపీలోకి వెళ్తున్నట్లు తెలిపారు. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్.. సబ్ కా విశ్వాస్  నినాదం తనకు నచ్చిందన్నారు. ఉద్యమకారులున్న బీజేపీలోకి రావటం.‌.  ఘర్ వాపసీ మాదిరిగా ఉందని బూర నర్సయ్య గౌడ్ (Former MP) పేర్కొన్నారు. 

Updated Date - 2022-10-17T18:29:10+05:30 IST