ఐదుగురికి కన్‌ఫర్డ్‌ ఐఏఎస్‌లుగా పదోన్నతి

ABN , First Publish Date - 2022-10-05T09:40:59+05:30 IST

ఐదుగురు స్టేట్‌ సివిల్‌ సర్వీసెస్‌ అధికారులకు కన్‌ఫర్డ్‌ ఐఏఎస్‌లుగా పదోన్నతులు కల్పించడానికి రంగం సిద్ధమైంది.

ఐదుగురికి కన్‌ఫర్డ్‌ ఐఏఎస్‌లుగా పదోన్నతి


రెవెన్యూ శాఖ నుంచి అధికారుల ఎంపిక

హైదరాబాద్‌, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): ఐదుగురు స్టేట్‌ సివిల్‌ సర్వీసెస్‌ అధికారులకు కన్‌ఫర్డ్‌ ఐఏఎస్‌లుగా పదోన్నతులు కల్పించడానికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు రెవెన్యూ శాఖకు చెందిన అధికారుల వివరాలతో సాధారణ పరిపాలనా శాఖ జాబితాను రూపొందించింది. ఇందులో క్రిస్టియన్‌ మైనారిటీ కార్పొరేషన్‌ ఎండీ నిర్మల క్రాంతి వెస్లీ, వరంగల్‌ అదనపు కలెక్టర్‌ కోట శ్రీవత్స, నిజామాబాద్‌ అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, కరీంనగర్‌ జిల్లా పరిషత్‌ సీఈవో ప్రియాంక, జగిత్యాల అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ ఉన్నారు. జాబితాను కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపించనుంది.

Read more