అమెరికాలో కాల్పులు... Nallagonda వాసి మృతి

ABN , First Publish Date - 2022-06-22T13:54:43+05:30 IST

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. మేరీలాండ్ రాష్ట్రంలో నల్లజాతీయుడు కాల్పులు జరిపాడు.

అమెరికాలో కాల్పులు... Nallagonda వాసి మృతి

నల్లగొండ: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. మేరీలాండ్ రాష్ట్రంలో నల్లజాతీయుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో నల్గొండ వాసి నక్క సాయిచరణ్‌(26) మృతిచెందాడు. ఆదివారం సాయంత్రం స్నేహితుడిని ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేసి తిరిగి కారులో వస్తుండగా నల్లజాతీయుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సాయిచరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. సాయిచరణ్ గత రెండేళ్లుగా మేరీల్యాండ్ రాష్ట్రంలోని బాల్టిమోర్‌లో ఉంటూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. సాయిచరణ్ మృతి సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతితో నల్గొండలో విషాదఛాయలు అలముకున్నాయి. 

Updated Date - 2022-06-22T13:54:43+05:30 IST