Himayath Nagarలో అగ్ని ప్రమాదం
ABN , First Publish Date - 2022-06-20T14:52:47+05:30 IST
హైదరాబాద్ హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ 2 వద్ద గల ఓ భవనంలోని మూడవ అంతస్తులో అగ్ని ప్రమాదం..
హైదరాబాద్ : హైదరాబాద్(Hyderabad) హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ 2 వద్ద గల ఓ భవనంలోని మూడవ అంతస్తులో అగ్ని ప్రమాదం(Fire accident) చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తోంది. నారాయణగూడ పోలీసులు సైతం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది