విద్యుత్ కోతలను నిరసిస్తూ రైతుల రాస్తారోకో
ABN , First Publish Date - 2022-08-04T10:00:01+05:30 IST
అప్రకటిత విద్యుత్ కోతలను నిరసిస్తూ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మాకులపేట ప్రధాన రహదారిపై రైతులు బుధవారం రాస్తారోకో చేశారు.
దండేపల్లి, ఆగస్టు 3: అప్రకటిత విద్యుత్ కోతలను నిరసిస్తూ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మాకులపేట ప్రధాన రహదారిపై రైతులు బుధవారం రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. తమ గ్రామాల పరిధిలో రోజులో కనీసం మూడు గంటల పాటు కూడా వ్యవసాయ మోటర్లకు విద్యుత్ సరఫరా కావడం లేదని అన్నారు. కడెం ప్రాజెక్టు నుంచి సాగునీరు అందేలా లేదని, కనీసం వ్యవసాయ బావుల కింద సాగు చేసుకుందామని చూస్తే కరెంట్ కోతలు వల్ల ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వీడి వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.