విద్యుదాఘాతంతో రైతు మృతి

ABN , First Publish Date - 2022-11-05T01:28:46+05:30 IST

విద్యుదాఘాతంతో రైతు మృతిచెందాడు.

విద్యుదాఘాతంతో రైతు మృతి
గజ్జి జంగయ్యయాదవ్‌

భూదానపోచంపల్లి, నవంబరు 4: విద్యుదాఘాతంతో రైతు మృతిచెందాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కనుముకుల గ్రామానికి చెందిన గజ్జి జంగయ్య యాదవ్‌ (47) శుక్రవారం ఉదయం తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లి విద్యుత మోటారు వేద్దామని వెళ్లేసరికి కరెంటు రావడం లేదని గమనించి అతడు ట్రాన్సఫార్మర్‌ పై ఫ్యూజు పోవడంతో దానిని సరిచేసేందుకు విద్యుత అధికారులకు ఫోన చేశాడు. అయితే ఎవరూ పట్టించుకోక పోవడంతో తనే ఫ్యూజును వేద్దామని తన జీతగాడైన ఆగయ్యతో వెళ్లి ట్రాన్సఫార్మర్‌ను బంద్‌ చేసి, తనే ట్రాన్సఫార్మర్‌ గట్టు పైకి ఎక్కి ఫ్యూజును

పరిశీలిస్తుండగా గతంలో ట్రాన్సఫార్మర్‌పై కరెంటు ఫ్యూజు చెడిపోవడంతో విద్యుత అధికారులు దాన్ని బాగు చేయకుండా డైరెక్టుగా ట్రాన్సఫార్మర్‌కు కనెక్షన ఇచ్చారు. అది గమనించక జంగయ్య ఫ్యూజులు తీద్దామనే సరికి వెంటనే విద్యుదాఘాతానికి గురై కుప్పకూలిపోయాడు. వెంటనే ఆగయ్య కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. కాగా, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సైదిరెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జంగయ్యకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పాడైపోయిన విద్యుత ట్రాన్సఫార్మర్‌కు మరమ్మతు లు చేయకుండా విద్యుత అధికారుల నిర్లక్ష్య ధోరణికి సంబంధిత అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజాప్రతినిధులు డిమాండ్‌

చేశారు. మృతదేహాన్ని జడ్పీటీసీ కోట పుష్పలత మల్లారెడ్డి, వైస్‌ ఎంపీపీ పాక వెంకటేశంయాదవ్‌, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు పాక మల్లే్‌షయాదవ్‌, సర్పంచు కోట అంజిరెడ్డి సందర్శించి, సంతాపం తెలిపారు.

Updated Date - 2022-11-05T01:28:48+05:30 IST