ప్రాణహితలో ఫడణవీస్‌ పుణ్యస్నానం

ABN , First Publish Date - 2022-04-24T08:39:30+05:30 IST

ప్రాణహిత పుష్కరాలు ముగింపునకు రావడంతో భక్తులు, వీఐపీల తాకిడి పెరుగుతోంది.

ప్రాణహితలో ఫడణవీస్‌ పుణ్యస్నానం

మహదేవపూర్‌/కృష్ణకాలనీ, ఏప్రిల్‌ 23: ప్రాణహిత పుష్కరాలు ముగింపునకు రావడంతో భక్తులు, వీఐపీల తాకిడి పెరుగుతోంది. పుష్కరాల 11వ రోజైన శనివారం మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ పుష్కర స్నానం చేశారు. మహారాష్ట్రలోని గడ్చిరోలిలోని ఘాట్‌ వద్ద పుష్కరస్నానం చేసి భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌ మండలంలోని కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన ఫడణవీస్‌ దేశప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కాళేశ్వర ముక్తీశ్వరస్వామిని తాను కోరుకున్నట్లు తెలిపారు. కాగా, కాళేశ్వరం ఘాట్ల వద్ద శనివారం దాదాపు 1.5 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. ఆదివారం సాయంత్రంతో ప్రాణహిత పుష్కరాలు ముగియనున్నాయి.

Read more