సీఎంఆర్‌ గడువు పొడిగించండి

ABN , First Publish Date - 2022-03-23T08:36:48+05:30 IST

గత యాసంగి బియ్యానికి సంబంధించిన కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) గడువును పొడిగించాలని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) కు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ లేఖ రాసింది.

సీఎంఆర్‌ గడువు పొడిగించండి

ఎఫ్‌సీఐకి పౌరసరఫరాల శాఖ లేఖ

హైదరాబాద్‌, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): గత యాసంగి బియ్యానికి సంబంధించిన కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) గడువును పొడిగించాలని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) కు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ లేఖ రాసింది. గడువును ఏప్రిల్‌ నెలాఖరు వరకు పొడిగించాలని కోరింది. ఈ నెలాఖరుకు సీఎంఆర్‌ డెడ్‌లైన్‌ ముగియనుంది. గత యాసంగికి సంబంధించి 62.52 లక్షల టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉండగా.. ఇప్పటికే 54 లక్షల టన్నుల బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అందించారు. మిగిలిన 8.52 లక్షల టన్నుల బియ్యాన్ని ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే సీఎంఆర్‌ గడువును పొడిగించాలని ఎఫ్‌సీఐకి పౌరసరఫరాల శాఖ మంగళవారం లేఖ రాసింది.

Updated Date - 2022-03-23T08:36:48+05:30 IST