అసెంబ్లీ సమావేశాలను పొడిగించండి

ABN , First Publish Date - 2022-09-08T08:51:04+05:30 IST

ప్రజా సమస్యలపై చర్చించేందుకు శాసనసభ సమావేశాలను పొడిగించాలని మజ్లిస్‌ పక్ష నేత అక్బరుదీన్‌ ఒవైసీ విజ్ఞప్తి చేశారు.

అసెంబ్లీ సమావేశాలను పొడిగించండి

స్పీకర్‌కు మజ్లిస్‌ పక్ష నేత అక్బరుద్దీన్‌ వినతి

హైదరాబాద్‌, సెస్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలపై చర్చించేందుకు శాసనసభ సమావేశాలను పొడిగించాలని మజ్లిస్‌ పక్ష నేత అక్బరుదీన్‌ ఒవైసీ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు స్పీకర్‌ పోచారం శ్రీనివా్‌సరెడ్డికి అక్బరుద్దీన్‌ ఒవైసీ రాసిన లేఖను మజ్లిస్‌ పార్టీ బుధవారం విడుదల చేసింది. ప్రస్తుత శాసనసభ సమావేశాల్లో మైనారిటీల సంక్షేమం, పాతబస్తీ అభివృద్ధి, వక్ఫ్‌స్థలాల పరిరక్షణ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీల స్కాలర్‌షిప్‌ సమస్యలు, ద్వితీయ అధికార భాషగా ఉర్దూ అమలు, ఉస్మానియా ఆస్పత్రి ప్రాంగణంలో ట్విన్‌ టవర్ల నిర్మాణం, విభజన హామీల అమలు తదితర అంశాలను స్వల్ప వ్యవధి చర్చ కింద ప్రస్తావించేందుకు అనుమతించాలని అక్బరుద్దీన్‌ కోరారు.

Read more