ఉక్కు సాధనకు ఉద్యమిస్తాం...

ABN , First Publish Date - 2022-03-05T06:06:34+05:30 IST

ఉక్కు సాధనకు ఉద్యమిస్తాం...

ఉక్కు సాధనకు ఉద్యమిస్తాం...
బయ్యారంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో అఖిలపక్షం నేతలు

మాజీ కేంద్ర మంత్రి బలరాంనాయక్‌

బయ్యారంలో అఖిలపక్ష నేతల రౌండ్‌ టేబుల్‌ సమావేశం

ఉక్కు సాధన కోసం  స్టీరింగ్‌ కమిటీ ఏర్పాటు

బయ్యారం, మార్చి 4 : రాష్ట్ర విభజన చట్టంలోని బయ్యారం ఉక్కు సాధన కోసం ఉద్యమిస్తామని టీఆర్‌ఎస్‌, బీజేపీ యేతర అఖిల పక్షం నాయకులు పేర్కొన్నారు. బయ్యారంలో శుక్రవారం అఖిలపక్ష పార్టీలైన కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఎం, సీపీఐ, టీజేఎస్‌. బీఎస్పీ, సీపీఐ ఎంఎల్‌ ప్రజాపంథా, సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ చంద్రన్న వర్గం నాయకులు రౌండ్‌ టేబుల్‌ సమావేశం అయ్యారు. ఈసమావేశంలో ఆయా పార్టీలకు చెందిన నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరచిన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ఈ ప్రాంతంలో అపారమైన ఖనిజ నిక్షేపాలు, ముడి ఇనుము తయారికి అవసరమగు వనరులు పుష్కలంగా ఉన్నప్పటికి సర్వేలతో కేంద్రం కాలయాపన చేస్తుందన్నారు. మొన్నటి వరకు బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ కేంద్రం ఏర్పాటు చేయకపోయినా తామే ఏర్పాటు చేస్తామని ప్రగల్భాలు పలికిన టీఆర్‌ఎస్‌ సర్కారు సైతం తాజాగా  కేంద్రంపై నెపం నెడుతూ దొంగ దీక్షలకు పూనుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని ఖనిజ నిక్షేపాలను ప్రైవేటు పరం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయని విమర్శించారు. 

స్టీరింగ్‌ కమిటీ ఏర్పాటు

ఉక్కు సాధన కోసం అఖిల పక్ష పార్టీలకు చెందిన జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులతో స్టీరింగ్‌ కమిటీని ఏర్పాటు చేశారు. ఈనెల 7న అన్ని మండల కేంద్రాలలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు స్టీరింగ్‌ కమిటీ నాయకులు పేర్కొన్నారు. 

ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్‌, ఏఐసీసీ ఆదివాసీ జాతీయ ఉపాఽధ్యక్షుడు బెల్లయ్యనాయక్‌, టీపీసీసీ ఉపాధ్యక్షుడు వేం నరేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు భరత్‌చందర్‌రెడ్డి, సర్పంచ్‌ వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి విజయ సారధి, సీపీఐ ఎంఎల్‌ ప్రజాపంథా జిల్లా కార్యదర్శి పాయం చిన్న చంద్రన్న, సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ చంద్రన్న వర్గం జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య, అఖిల పక్షం నాయకులు చంద్రయ్య, శ్రీహరి, ముసలయ్య, శ్రీనివా్‌సరెడ్డి, మధు, జగ్గన్న, సూర్యం, కిరణ్‌, శ్రీను, నాగేశ్వరరావు, రాంచంద్రయ్య, శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2022-03-05T06:06:34+05:30 IST