అప్పులపై ఆర్థిక మంత్రి చర్చకు రావాలి: ఈటల

ABN , First Publish Date - 2022-11-30T13:12:25+05:30 IST

రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న అప్పులపై ఆర్థిక మంత్రి చర్చకు రావాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సవాల్ విసిరారు.

అప్పులపై ఆర్థిక మంత్రి చర్చకు రావాలి: ఈటల

Hyderabad : రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న అప్పులపై ఆర్థిక మంత్రి చర్చకు రావాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. అప్పుడే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయన్నారు. అప్పు తెస్తున్నాడు 25 ఏళ్లకు కడతాం అంటున్నాడని ఈటల పేర్కొన్నారు. అప్పటి వరకూ తాను ఉండను అనుకొని అడ్డగోలుగా అప్పులు తెస్తున్నాడని ఈటల పేర్కొన్నారు. అప్పుల గురించి ప్రభుత్వం ప్రజలకు సమాచారం ఇవ్వాలని.. కానీ సమాచారం ఇవ్వరన్నారు. ఆన్‌లైన్‌లో అప్పుల వివరాలను కేసీఆర్ పెట్టనివ్వడన్నారు. కేసీఆర్ చేస్తున్న మోసాన్ని త్వరలోనే తెలంగాణ ప్రజలు తిప్పి కొడతారని ఈటల పేర్కొన్నారు.

Updated Date - 2022-11-30T13:12:25+05:30 IST

Read more