MP Arvindపై దాడిని ఖండించిన ఈటల
ABN , First Publish Date - 2022-07-15T21:40:10+05:30 IST
ఎంపీ ధర్మపురి అరవింద్‌పై జరిగిన దాడిని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రంగా ఖండించారు.

హుజురాబాద్: ఎంపీ ధర్మపురి అరవింద్(MP Dharmapuri Arvind)పై జరిగిన దాడిని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Etala Rajender) తీవ్రంగా ఖండించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కొనే సత్తా లేక టీఆర్ఎస్(trs) ఇలాంటి దాడులు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి వస్తున్న ఆదరణ జీర్ణించుకోలేక దాడులకు దిగడం హేయమైన చర్య అన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని.. ప్రజా క్షేత్రంలో టీఆర్ఎస్ నాయకులకు శిక్ష తప్పదని ఈటల రాజేందర్ హెచ్చరించారు.