Warangal: ఐదవ విడత పల్లెప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించిన Errabelli
ABN , First Publish Date - 2022-06-03T18:00:26+05:30 IST
వరంగల్ జిల్లా:ఐదవ విడత పల్లెప్రగతి కార్యక్రమాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు.

Warangal జిల్లా: రాయపర్తి మండలం, కొత్తూరులో ఐదవ విడత పల్లెప్రగతి కార్యక్రమాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakara rao) శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సర్పంచ్లు ఎవరూ అధైర్య పడొద్దన్నారు. అన్ని బిల్లులూ మంజూరు చేస్తామని, సీసీ రోడ్ల బిల్లులు కూడా విడుదల చేస్తామన్నారు. గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వడం లేదని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు పిచ్చికూతలు కూస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చే నిధుల విషయంలో ఇబ్బందులకు గురి చేస్తోందని, కరెంట్ మోటార్లకు మీటర్లు పెడతామని అమిత్ షా చెబుతున్నారన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీటర్లు పెట్టనివ్వమని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.