TS News: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు పోటెత్తిన పత్తి
ABN , First Publish Date - 2022-10-17T15:50:56+05:30 IST
జిల్లాలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు పత్తి పోటెత్తింది.
వరంగల్: జిల్లాలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు పత్తి పోటెత్తింది. కాగా... మార్కెట్ యార్డ్‌లో పీఓఎస్ మిషన్ పనిచేయకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు రోజురోజుకు పత్తి ధర పతనమవుతూ వస్తోంది. కొత్త పత్తి రాకతో వ్యాపారులుధరలను నియంత్రిస్తున్నారు. క్వింటాల్ పత్తి ధర రూ.7890గా పలుకుతోంది. తెల్ల బంగారం ధర తగ్గుతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.