ఎన్నికల పిడుగు ఎప్పుడైనా పడొచ్చు..

ABN , First Publish Date - 2022-08-04T10:26:33+05:30 IST

ఎన్నికల పిడుగు ఎప్పుడైనా పడొచ్చని, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.

ఎన్నికల పిడుగు ఎప్పుడైనా పడొచ్చు..

కార్యకర్తలు సిద్ధంగా ఉండండి: మాజీ మంత్రి తుమ్మల

నేలకొండపల్లి, ఆగస్టు 3: ఎన్నికల పిడుగు ఎప్పుడైనా పడొచ్చని, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో బుధవారం పర్యటించిన ఆయన పలు కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా నేలకొండపల్లిలోని ముత్తినేని వీరయ్య నివాసంలో పలువురు నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ‘ఎన్నికలు ఎప్పుడొస్తాయ్‌.. సార్‌’ అని కార్య కర్తలు పదేపదే ప్రశ్నించగా స్పందించిన తుమ్మల.. ఎన్నికల పిడుగు ఎప్పుడైనా పడొచ్చని, గతంలో మాదిరిగా కార్యకర్తలు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా పార్టీ కోసం పని చేయాలన్నారు. గతంలో తాను పూర్తిగా నియోజకవర్గం అభివృద్ధిపైనే దృష్టి పెట్టానని, సీఎం కేసీఆర్‌ సహాయంతో 30 ఏళ్లలో జరగాల్సిన అభివృద్ధిని రెండేళ్లలో చేశానన్నారు. మళ్లీ పాలేరు నుంచే పోటీ చేయాలని నాయకులు, కార్యకర్తలు కోరగా.. తాను పాలేరుపై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టానని, గతంలో జరిగిన తప్పులు జరగకుండా చూడాలని సూచించారు. కార్యకర్తలు పూర్తిస్థాయిలో శ్రమించాలని, తాను అందరికీ అందుబాటులో ఉంటానన్నారు. గతంలో అభివృద్ధిపైనే దృష్టిపెట్టడంతో కార్యకర్తలతో పూర్తి సమయం గడపలేకపోయానని తెలిపారు. 

Updated Date - 2022-08-04T10:26:33+05:30 IST