చికిత్స పొందుతూ వృద్ధుడి మృతి

ABN , First Publish Date - 2022-12-30T00:51:08+05:30 IST

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒక వృద్ధుడు గురువారం మృతి చెందాడు.

 చికిత్స పొందుతూ వృద్ధుడి మృతి

వలిగొండ, డిసెంబరు 29: ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒక వృద్ధుడు గురువారం మృతి చెందాడు. ఏఎ్‌సఐ శ్యాంసుందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గోకారం గ్రామానికి చెందిన యాట శ్రీరాములు (65) సంవత్సరాలు ఒంటరిగా నివసిస్తున్నాడు. 8 నెలల క్రితం భార్య మృతి చెందింది. మద్యానికి బానిసై ఒంటరితనం భరిచలేక జీవితంపై విరక్తి చెంది ఈనెల 27న క్రిమిసంహారక మందు తాగాడు. చికిత్స నిమిత్తం అతడిని చౌటుప్పల్‌ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆసుపత్రికి అదే రోజు తరలించగా, చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. శ్రీరాములు కుమారుడు నర్సింహ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2022-12-30T00:51:08+05:30 IST

Read more