డ్రగ్స్‌ కేసులో ఎడ్విన్‌కు ముందస్తు బెయిల్‌ నిరాకరణ

ABN , First Publish Date - 2022-10-07T08:01:21+05:30 IST

ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన డ్రగ్స్‌ కేసులో ఏడో నిందితుడిగా ఉన్న గోవాకు చెందిన ఎడ్విన్‌ న్యూన్స్‌కు ముందస్తు బెయిల్‌ ఇవ్వడానికి హైకోర్టు గురువారం నిరాకరించింది.

డ్రగ్స్‌ కేసులో ఎడ్విన్‌కు ముందస్తు బెయిల్‌ నిరాకరణ

హైదరాబాద్‌, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన డ్రగ్స్‌ కేసులో ఏడో నిందితుడిగా ఉన్న గోవాకు చెందిన ఎడ్విన్‌ న్యూన్స్‌కు ముందస్తు బెయిల్‌ ఇవ్వడానికి హైకోర్టు గురువారం నిరాకరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రితీష్‌ బోర్కర్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ప్రితీష్‌ కాల్‌ లిస్టు ఆధారంగా ఎడ్విన్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ ఎడ్విన్‌ గురువారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పోలీసుల తరఫు న్యాయవాది ఖాజా విజారత్‌ వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో ఇంకా దర్యాప్తు పూర్తి కాలేదని చెప్పారు. దీంతో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరిస్తూ జస్టిస్‌ సుమలత ధర్మాసనం ఆదేశాలు వెలువరించింది.

Updated Date - 2022-10-07T08:01:21+05:30 IST