‘దళితబంధు’తో ఆర్థిక పరిపుష్ఠి సాధించాలి

ABN , First Publish Date - 2022-12-07T23:56:36+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘దళిత బంధు’ నిధులతో ఆర్థిక పరిపుష్ఠి సాధించాలని అదనపు కలెక్టర్‌ దీపక్‌తివారీ సూచించారు. బుధవారం మండలంలోని సీఎం దత్త త గ్రామం వాసాలమర్రిలో ‘దళితబంధు’ యూనిట్లను ఏవిధంగా సద్వినియోగం చేసుకుంటున్నారో క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

‘దళితబంధు’తో ఆర్థిక పరిపుష్ఠి సాధించాలి

తుర్కపల్లి, డిసెంబరు 7: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘దళిత బంధు’ నిధులతో ఆర్థిక పరిపుష్ఠి సాధించాలని అదనపు కలెక్టర్‌ దీపక్‌తివారీ సూచించారు. బుధవారం మండలంలోని సీఎం దత్త త గ్రామం వాసాలమర్రిలో ‘దళితబంధు’ యూనిట్లను ఏవిధంగా సద్వినియోగం చేసుకుంటున్నారో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దళితబంధు నిధులతో కిరాణషాపు నడుపుతున్న బాలమణి, మాదాపూర్‌లో బొట్టు ఎల్లమ్మఏర్పాటు చేసుకున్న మెడికల్‌ ల్యాబ్‌ను సందర్శించారు. గ్రామంలో 76దళిత కుటుంబాలకు ఈ పథకం వర్తింపజేయగా, అందరూ వివిధ యూనిట్లను ఏర్పాటు చేసుకొని జీవనోపాధి పొందుతున్నారు. కొంతమంది లబ్ధిదారులను దీపక్‌తివారీ కలిసి ఆదాయ, వ్యయాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. ఆయనవెంట ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ శ్యాంసుందర్‌, ఎంపీడీవో ఉమాదేవి, పశువైద్యాధికారి శ్రీనివా్‌సరావు, ట్రాన్స్‌కో ఏఈ భిక్షపతిగౌడ్‌ ఉన్నారు.

Updated Date - 2022-12-07T23:56:40+05:30 IST