మునుగోడు టీజేఎస్‌ అభ్యర్థి వినయ్‌గౌడ్‌

ABN , First Publish Date - 2022-10-12T09:45:23+05:30 IST

మునుగోడు ఉప ఎన్నిక బరిలో తెలంగాణ జన సమితి(టీజేఎస్‌) అభ్యర్థి పల్లె వినయ్‌గౌడ్‌ పోటీ చేస్తారని ఆ పార్టీ అధినేత కోదండరాం మంగళవారం ప్రకటించారు.

మునుగోడు టీజేఎస్‌ అభ్యర్థి వినయ్‌గౌడ్‌

హైదరాబాద్‌, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): మునుగోడు ఉప ఎన్నిక బరిలో తెలంగాణ జన సమితి(టీజేఎస్‌) అభ్యర్థి పల్లె వినయ్‌గౌడ్‌ పోటీ చేస్తారని ఆ పార్టీ అధినేత కోదండరాం మంగళవారం ప్రకటించారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీల ఆధిపత్య పోరే మునుగోడు ఉప ఎన్నికకు కారణమైందని ఆయన విమర్శించారు. తెలంగాణ అస్తిత్వాన్ని అడ్డుపెట్టుకుని అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ ఆస్తులు కూడబెట్టుకున్నారని ఒక ప్రకటనలో ఆరోపించారు.

Read more