TS: రామాలయానికి ముస్లింల విరాళం

ABN , First Publish Date - 2022-03-05T11:45:28+05:30 IST

రాజకీయ ప్రయోజనాల కోసం దేశంలోని కొన్నిచోట్ల మత విద్వేషాలు రెచ్చగొడుతున్న తరుణంలో మ తాలకతీతంగా రామాలయానికి ముస్లింలు విరాళం ఇచ్చి పరమత

TS: రామాలయానికి ముస్లింల విరాళం

కరీంనగర్: రాజకీయ ప్రయోజనాల కోసం దేశంలోని కొన్నిచోట్ల మత విద్వేషాలు రెచ్చగొడుతున్న తరుణంలో మ తాలకతీతంగా రామాలయానికి ముస్లింలు విరాళం ఇచ్చి పరమత సహనానికి నిదర్శనంగా నిలిచారు. కేసముద్రం మండలం ఉప్పరపల్లిలో నూతనంగా సీతారామచంద్రస్వామి దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన రైతు అయిన మహ్మద్‌ అమీరొద్దిన్‌-షరీఫ, వారి కుమారుడు విద్యుత్‌ శాఖలో సబ్‌స్టేషన్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న అజ్మత్‌-సైనాజ్‌ దంపతులు రూ.31,786ల విరాళాన్ని శుక్రవారం అందజేశారు. మతాలకతీతంగా విరాళం అందించడంపై పలువురు గ్రామస్తులు అభినందించారు. ఇన్‌చార్జ్‌ సర్పంచ్‌ ఎలబోయిన సారయ్య, వార్డు సభ్యుడు అరిగె విజేందర్‌, నూకల వెంకటేశ్వర్లు, మంచాల కుమార్‌, తండ సంపత్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-03-05T11:45:28+05:30 IST