ప్రకాశంబజార్‌ మడిగలను క్రమబద్ధీకరించొద్దు

ABN , First Publish Date - 2022-12-31T23:51:21+05:30 IST

నల్లగొండ పట్టణంలోని ప్రకాశంబజార్‌లో అత్యంత విలువైన మునిసిపల్‌ మడిగలను వ్యాపారులకు క్రమబద్ధీకరించాలని వచ్చిన సర్క్యులర్‌పై కాంగ్రెస్‌, బీజేపీ కౌన్సిలర్లు మండిపడ్డారు. బంగారు బాతును కోసినట్లుగా మునిసిపల్‌ మడిగలను విక్రయిస్తే రానున్న రోజుల్లో ప్రజలకు వంద రెట్ల భారం పడుతుందని ఆయా కౌన్సిలర్లు మం డిపడ్డారు.

   ప్రకాశంబజార్‌ మడిగలను క్రమబద్ధీకరించొద్దు
మునిసిపల్‌ సమావేశంలో మాట్లాడుతున్న చైర్మన సైదిరెడ్డి

ప్రకాశంబజార్‌ మడిగలను క్రమబద్ధీకరించొద్దు

ఆస్తులను అమ్మి పట్టణాభివృద్ధి చేయాల్సిన అవసరమేంటి?

బీజేపీ, కాంగ్రెస్‌ కౌన్సిలర్ల వాకౌట్‌, నిరసన

రామగిరి, డిసెంబరు 31: నల్లగొండ పట్టణంలోని ప్రకాశంబజార్‌లో అత్యంత విలువైన మునిసిపల్‌ మడిగలను వ్యాపారులకు క్రమబద్ధీకరించాలని వచ్చిన సర్క్యులర్‌పై కాంగ్రెస్‌, బీజేపీ కౌన్సిలర్లు మండిపడ్డారు. బంగారు బాతును కోసినట్లుగా మునిసిపల్‌ మడిగలను విక్రయిస్తే రానున్న రోజుల్లో ప్రజలకు వంద రెట్ల భారం పడుతుందని ఆయా కౌన్సిలర్లు మం డిపడ్డారు. క్రమబద్ధీకరణపై వచ్చిన సర్క్యులర్‌ను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌, బీ జేపీ కౌన్సిలర్లు వాకౌట్‌ చేసి గేటు ఎదుట నిరసన తెలిపారు. శనివారం స్థానిక మునిసిపల్‌ కార్యాలయ సమావేశంలో చైర్మన మందడి సైదిరెడ్డి అ ధ్యక్షతన సమావేశం జరిగింది. మునిసిపాలిటీకి చెందిన ఆస్థులను అన్యాక్రాంతం చేస్తే రాబోయే రోజుల్లో మునిసిపాలిటీని ఎలా నిర్వహిస్తారు? వా హనాల డీజిల్‌ ఖర్చు పరిస్థితి ఏమిటి? కరెంటు బిల్లుల చెల్లింపు, కార్మికుల జీతాలు ఎలా ఇస్తారని ప్రతిపక్ష కౌన్సిలర్లు ప్రశ్నించారు. ఈ సందర్భంగా బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ బండారు ప్రసాద్‌ మాట్లాడుతూ ప్రకాశంబజార్‌, పాతబస్తీ, వస్త్రలత బజార్‌ తదితర ప్రాంతాల్లో ఉన్న మునిసిపల్‌ ఆస్తులను ఏ విధంగా వ్యాపారులకు ధారాదత్తం చేస్తారని ప్రశ్నించారు. ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వమే వ్యాపారులకు క్రమబద్ధీకరించాలని సర్క్యులర్‌ జారీ చేయడమేమిటని ఆయన ప్రశ్నించారు. రోడ్డు విస్తరణ పేరుతో చేస్తున్న డ్రైనేజీ నిర్మాణాలు నెలలు గడుస్తున్నా పూర్తి కాకపోవడంతో ప్రజలు, వ్యా పారులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మునిసిపల్‌ మాజీచైర్మన బొడ్డుపల్లి లక్ష్మి మాట్లాడుతూ గత కౌన్సిల్‌ హ యాంలో ప్రకాశంబజార్‌ మడిగలను క్రమబద్ధీకరించవద్దని కౌన్సిల్‌ తీర్మా నం చేసిందని గుర్తు చేశారు. ఇదే క్రమంలో మునిసిపల్‌ ఆధ్వర్యంలోనే షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మిస్తే అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంద ని, ఈ విషయమై ప్రభుత్వానికి అప్పట్లో నివేదిక పంపినట్లు తెలిపారు. అనంతరం మునిసిపల్‌ కమిషనర్‌ రమణాచారి మాట్లాడుతూ ఓ కౌన్సిల్‌ హయాంలో వ్యాపారులకు ఇవ్వాలని తీర్మానం ఉన్నందున సదరు వ్యాపారులకే క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం కలెక్టర్‌కు సర్క్యులర్‌ జారీ చేసిన ట్లు తెలిపారు. జనవరి నెలాఖరులోగా కొన్ని పనులు, జూనలోగా మరికొ న్ని అభివృద్థి పనులు పూర్తి చేయాలని కలెక్టర్‌ కాంట్రాక్టర్లను ఆదేశించిన ట్లు తెలిపారు. మునిసిపల్‌ చైర్మన మందడి సైదిరెడ్డి మాట్లాడుతూ పట్టణంలో చేపడుతున్న రహదారుల విస్తరణ, సుందరీకరణ పనులు అతి త్వరలోనే పూర్తవుతాయని తెలిపారు. మంత్రి కేటీఆర్‌తో నీలగిరి కళాభార తి, ఉదయసముద్రం వంటి పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. అ నంతరం ఎజెండాను ఆమోదిస్తున్నట్లు చైర్మన ప్రకటించారు. సమావేశం లో మునిసిపల్‌ ఈఈ రాములు, ఏసీపీ నాగిరెడ్డి, డీఈలు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T23:51:23+05:30 IST