మైనర్లను అనుమతించొద్దు

ABN , First Publish Date - 2022-06-07T08:38:43+05:30 IST

మైనర్లను అనుమతించినా.., ఏమైనా ఘటనలు జరిగినా కేసు లు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని మాదాపూర్‌ డీసీపీ

మైనర్లను అనుమతించొద్దు

పబ్‌ల నిర్వాహకులకు డీసీపీ స్పష్టీకరణ


రాయదుర్గం, జూన్‌6 (ఆంధ్రజ్యోతి): మైనర్లను అనుమతించినా.., ఏమైనా ఘటనలు జరిగినా కేసు లు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని మాదాపూర్‌ డీసీపీ శిల్పవల్లి పబ్‌ల నిర్వాహకులను హెచ్చరించారు. సోమవారం పబ్‌ల నిర్వాహకులతో ఆమె సమావేశం నిర్వహించారు. పబ్‌ల ప్రాంగణం లో మద్యం రహిత పార్టీలకు కూడా మైనర్లను అనుమతించరాదని పేర్కొన్నారు. యువతులతో ఆశ్లీల నృత్యాలు వంటివి తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మద్యం మత్తులో ఉన్న కస్టమర్లకు వాలెట్‌ డ్రైవర్లను నియమించి ఇంటికి చేర్చాలని పేర్కొన్నారు.

Read more