Hyderabad: పాల ప్యాకెట్ కోసం వెళ్లి యువతి అదృశ్యం
ABN , First Publish Date - 2022-10-17T16:05:39+05:30 IST
పాలప్యాకెట్ కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన సంఘటన బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధి
హైదరాబాద్/బోయినపల్లి: పాలప్యాకెట్ కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన సంఘటన బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బోయినపల్లి పంచశీల ఎన్‌క్లేవ్‌లో నివసిస్తున్న బేతి దశరథ కుమార్తె బేతిసుచిత్ర (20) బేగంపేట్‌లో టెలీకాలర్‌గా పనిచేస్తోంది. శనివారం పాల ప్యాకెట్ తెస్తానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఇరుగు పొరుగు వాళ్లను ఆరాతీసినా ఫలితం లేకపోవడంతో అనుమానం వచ్చిన తండ్రి ఆదివారం బోయినపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవికుమార్ తెలిపారు.