Bhadradri రామయ్య ప్రసాదం కోసం భక్తుల ఇబ్బందులు
ABN , First Publish Date - 2022-05-26T15:40:36+05:30 IST
భద్రాద్రి రామయ్య సన్నిధిలో లడ్డూ ప్రసాదాల కోసం భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి రామయ్య సన్నిధిలో లడ్డూ ప్రసాదాల కోసం భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వేలాది మంది భక్తులు దర్శనానికి వస్తుండగా ఒక లడ్డు కౌంటర్ ఏర్పాటు చేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంటలకొద్దీ లడ్డూ ప్రసాదం కోసం క్యూలైన్లో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రసాదాల కౌంటర్ల నిర్వహణపై ఆలయ అధికారులకు భక్తులు ఫిర్యాదు చేశారు.