ఆర్టీసీని ఆదుకున్న డీజిల్‌ సెస్‌

ABN , First Publish Date - 2022-06-12T08:44:34+05:30 IST

డీజిల్‌ సెస్‌ పెంపుదలతో ఆర్టీసీ ఆదాయం పెరిగింది. స్లాట్‌ డీజిల్‌ సెస్‌ చార్జీల పెంపుదలకు ముందు ఆర్టీసీ రోజువారీ టికెట్‌

ఆర్టీసీని ఆదుకున్న డీజిల్‌ సెస్‌

 ఆదాయం పెరిగి.. నష్టాల నుంచి గట్టెక్కే చాన్స్‌


హైదరాబాద్‌, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): డీజిల్‌ సెస్‌ పెంపుదలతో ఆర్టీసీ ఆదాయం పెరిగింది. స్లాట్‌ డీజిల్‌ సెస్‌ చార్జీల పెంపుదలకు ముందు ఆర్టీసీ రోజువారీ టికెట్‌ ఆదాయం రూ.12-13 కోట్లకు మించలేదు. తాజా పెంపుదలతో ఆదాయం గురువారం రూ.15.21 కోట్లు, శుక్రవారం రూ.15.51 కోట్లకు చేరిందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం పెరిగిన డీజిల్‌ ధరలు, ఇతర అవసరాల కోసం టికెట్‌ ఆదాయం రోజుకు రూ.15 కోట్లకు పైగా సమకూరితేనే  ఆర్టీసీ మనుగడ సాధిస్తుందని అధికారులు అంటున్నారు. వాస్తవానికి బస్సు చార్జీల పెంపు ప్రతిపాదనను టీఎ్‌సఆర్టీసీ నివేదించినా ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రాలేదు. మరోవైపు డీజిల్‌ ధర రూ.84 నుంచి రూ.118కు పెరగడంతో ఆర్టీసీపై మోయలేని భారం పడింది. పెరుగుతున్న నిర్వహణ వ్యయాన్ని అధిగమించేందుకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ సాహసోపేత నిర్ణయం తీసుకొని సేఫ్టీ, డీజిల్‌ సెస్‌లను తొలుత నామమాత్రంగా విధించారు. రాయి తీ బస్‌పా్‌సలు, టీ-24 టికెట్‌ ధరలు సైతం పెంచారు. అయినా ఆశించిన ప్రయోజనం లభించకపోవడంతో ప్రయాణికులపై డీజిల్‌ సెస్‌ను స్లాబ్‌ల ప్రకారం రూ.5 నుంచి రూ.170కు పెంచారు.


దీంతో ఆర్టీసీకి రోజూ రూ.2.8 కోట్ల వరకు అదనపు ఆదాయం లభించిందని అధికారులు తెలిపారు. అలాగే విద్యార్థుల రాయితీ బస్‌పాస్‌ చార్జీలు పెంచడంతో ఏటా రూ.150-200 కోట్ల అదనపు ఆదాయం లభిస్తుందని అంచనా వేశారు. వాస్తవ చార్జీల్లో విద్యార్థుల నుంచి ఇంతకాలం 11ు మాత్రమే వసూలు చేసిన ఆర్టీసీ ఇప్పుడు దాన్ని 25ుకు పెంచింది. పెరిగిన ఆదాయంతో ఆర్టీసీ నిర్వహణ ఖర్చులు సర్దుబాటు చేసే అవకాశం ఏర్పడిందని అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు.  1016 కొత్త బస్సుల కొనుగోలు కోసం ఉత్పత్తి సంస్థల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. అలాగే వివిధ కారణాలతో మరణించిన, అనారోగ్యానికి గురై విధులు నిర్వహించలేని స్థితిలో ఉన్న ఉద్యోగుల కుటుంబాల పిల్లల కారుణ్య నియామకానికి త్వరలో చర్యలు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. 

Read more