మృతదేహంతో ఆసుపత్రి ఎదుట ధర్నా

ABN , First Publish Date - 2022-11-18T00:42:27+05:30 IST

వైద్యం వికటించి మృతి చెందాడని ఆరోపిస్తూ మృతదేహంతో ఆసుపత్రి ముందు ధర్నా చేసిన ఘటన గురువారం భువనగిరిలో జరిగింది.

మృతదేహంతో ఆసుపత్రి ఎదుట ధర్నా
రోధిస్తున్న బంధువులు

భువనగిరి టౌన, నవంబరు 17: వైద్యం వికటించి మృతి చెందాడని ఆరోపిస్తూ మృతదేహంతో ఆసుపత్రి ముందు ధర్నా చేసిన ఘటన గురువారం భువనగిరిలో జరిగింది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... తుర్కపల్లి మండలం బద్దూతండాకు చెందిన బోర్‌వెల్‌ డ్రిల్లర్‌ గుగులోతు లచ్చిరాం (45) అనారోగ్యంతో గురువారం ఉదయం భువనగిరి విద్యానగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి వచ్చాడు. దీంతో ఆసుపత్రి నిర్వాహకులు అందించిన చికిత్స అనంతరం తిరిగి ఇంటికి వెళ్లాడు. వైద్యుడు సూచించిన ప్రకారం ట్యాబ్లెట్‌ను వేసుకున్న కొద్ది సేపటికే అపస్మారక స్థితికి వెళ్లాడు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు తిరిగి ఆసుపత్రికి తీసుకువచ్చేలోపే మృతి చెందాడు. దీంతో ఆసుపత్రి నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందాడని ఆరోపిస్తూ మృతదేహంతో ఆసుపత్రి ముందు రాత్రి పొద్దుపోయే వరకు కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ వైద్యులతో వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో మధ్యవర్తుల జోక్యంతో వివాదం సద్దుమనిగింది. లచ్చిరామ్‌కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె, భార్య ఉన్నారు.

Updated Date - 2022-11-18T00:42:27+05:30 IST