కాంగ్రెస్ గెలవగానే ధరణి రద్దు
ABN , First Publish Date - 2022-07-07T09:10:33+05:30 IST
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

- కేసీఆర్ పాలనలో లక్ష కోట్ల రూపాయల అవినీతి
- రాష్ట్ర ప్రభుత్వమే భూ కబ్జాలకు పాల్పడుతోంది
- తక్కువ ధరలకు ఫ్యాక్టరీలకు భూములిస్తూ
- నయా భూస్వాములను తయారు చేస్తున్నారు
- ధరణి రచ్చబండలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్
కవాడి గూడ, జూలై 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అప్పటి వరకూ దీనికి వ్యతిరేకంగా బలమైన ఉద్యమాలు చేపడతామని వెల్లడించారు. ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో బుధవారం తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధరణి రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం భూ కబ్జాలకు పాల్పడుతోంది. హరితహారం పేరుతో గిరిజనుల భూములను బలవంతంగా లాక్కొంటోందని, నష్ట పరిహారం అడిగితే భూ నిర్వాసితులను అరెస్టు చేసి జైళ్లలో పెడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను అప్పనంగా ఫ్యాక్టరీలకు కట్టబెడుతూ నయా భూస్వాములను కేసీఆర్ తయారు చేస్తున్నారని విమర్శించారు. ఇబ్రహీంపట్నంలో ఎకరా రూ.3-4కోట్లు పలుకుతుండగా, రైతులకు రూ.10లక్షలు ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారని ధ్వజమెత్తారు. అక్కడ ఓ కంపెనీకి 19ఎకరాల భూమిని అతి తక్కువ ధరకు కట్టబెట్టారని తెలిపారు. ఐటీ కంపెనీలకు కేసీఆర్ ప్రభుత్వం వాటికి అడ్డగోలుగా భూములు పంచిపెడుతోందని ఆరోపించారు. మరోసారి భూములను గుంజుకోవడానికి ఎవరైనా అఽధికారులు వస్తే చెట్లకు కట్టేసి, తొండలను వదిలిపెట్టాలని రైతులకు పిలుపునిచ్చారు. సచివాలయంలో లక్షలాది ఎకరాల భూముల రికార్డులు ఉండ గా, దానిని కూల్చేసి భూ రికార్డులను కేసీఆర్ ప్రభు త్వం మాయం చేసిందని ధ్వజమెత్తారు. రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని చెప్పడం కేసీఆర్ ఆడుతున్న కొత్త నాటకమని దుయ్యబట్టారు. ధరణిపై తాము ప్రశ్నిస్తున్నందుకే కేసీఆర్ వరు స సమీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. ఽధరణిలో సమస్యలపై ప్రభుత్వం ఒక ఫోన్ నంబర్ కేటాయించగా లక్షకుపైనే ఫిర్యాదులు వచ్చాయని, పోర్టల్‌ను రద్దు చే స్తేనే ఆ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని అన్నారు. మాజీ ఎంపీ వి.హనుమంతరావు మాట్లాడుతూ ఈనెల 8న ధరణి పోర్టల్‌కు వ్యతిరేకంగా హెచ్ఎండీఏ ముందు నిరసన తెలుపుతామని తెలిపారు. ఎమ్మెల్యే సీతక్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహే్‌షకుమార్‌గౌడ్, కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి మాట్లాడారు.
బీజేపీ కార్యాలయం ముట్టడి
అఫ్జల్‌గంజ్: గ్యాస్ ధర పెంపును నిరసిస్తూ మహి ళా కాంగ్రెస్ నేతలు నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం ముట్టడికి యత్నించారు. మహిళా కాంగ్రెస్ చైర్మన్ సునీతా రావు ఆధ్వర్యంలో తమ కార్యాలయంలోకి వచ్చి న నేతలను బీజేపీ మహిళా కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు కాంగ్రెస్ నేతలను అక్కడి నుంచి తరలించారు. మరోపక్క, కాంగ్రెస్ నేతలు తమ కార్యాలయంలో విఽధ్వంసం సృష్టించారంటూ బీజేపీ నాయకులు ఆబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నేడు కాంగ్రెస్‌లో చేరికలు
హైదరాబాద్: అధికార టీఆర్‌ఎ్‌సకు చెందిన పలువురు నేతలు గురువారం కాంగ్రె్‌సలో చేరనున్నారు. గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో వారు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. అయితే మీడియాలో మంగళవారం పలు పేర్లు రావడంతోనే అధికార టీఆర్ఎస్ అప్రమత్తమైందని, ఆయా నాయకులతో సంప్రదింపులూ చేపట్టిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చేరనున్న నేతల విషయంలో గోప్యత పాటించాల్సిన స్థితి ఏర్పడిందని కాంగ్రెస్ నేత ఒక రు తెలిపారు. కాగా.. సీడబ్ల్యుసీ శాశ్వత ఆహ్వానితునిగా నియమితుడైన టి. సుబ్బరామిరెడ్డికి గాంధీభవన్‌లో గురువారం సన్మానం చేయనున్నారు. రేవంత్‌రెడ్డి, భట్టివిక్రమార్క, ముఖ్యనేతలు పాల్గొంటారు. అలాగే టీపీసీసీ అధ్యక్షునిగా రేవంత్‌రెడ్డి చార్జి తీసుకుని గురువారంతో ఏడాది పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో ఆయనకూ సన్మానం చేయనున్నారు.