TS news: బాసరలో వైభవంగా దేవి శరన్నవరాత్రి వేడుకలు

ABN , First Publish Date - 2022-10-01T14:26:15+05:30 IST

బాసర సరస్వతీ క్షేత్రంలో దేవి శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.

TS news: బాసరలో వైభవంగా దేవి శరన్నవరాత్రి వేడుకలు

నిర్మల్: బాసర సరస్వతీ క్షేత్రంలో దేవి శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈరోజు కాత్యాయని దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. రేపు మూల నక్షత్ర పర్వదినం కావడంతో బాసరకు భక్తులు పోటెత్తుతున్నారు. అక్షరాభ్యాస మంటపాలు, క్యూ లైన్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తుల రద్దీ నేపథ్యంలో దేవాదాయ, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. 

Read more