సాంఘిక సంక్షేమ గురుకులంలో డిజైన్‌ అండ్‌ టెక్నాలజీ కోర్సు

ABN , First Publish Date - 2022-08-04T10:01:46+05:30 IST

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 2022-23 విద్యా సంవత్సరం నుంచి బీఎస్సీలో డిజైన్‌ అండ్‌ టెక్నాలజీ కోర్సును ప్రవేశ పెట్టినట్లు సంస్థ కార్యదర్శి రోనాల్డ్‌ రోస్‌ తెలిపారు.

సాంఘిక సంక్షేమ గురుకులంలో డిజైన్‌ అండ్‌ టెక్నాలజీ కోర్సు

ముందుగా సిరిసిల్ల మహిళా డిగ్రీ కళాశాలలో ప్రారంభం

హైదరాబాద్‌, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 2022-23 విద్యా సంవత్సరం నుంచి బీఎస్సీలో డిజైన్‌ అండ్‌ టెక్నాలజీ కోర్సును ప్రవేశ పెట్టినట్లు సంస్థ కార్యదర్శి రోనాల్డ్‌ రోస్‌ తెలిపారు. ఈ విద్యా సంవత్సరం మొదటగా సిరిసిల్లలోని డిగ్రీ మహిళా గురుకులంలో ప్రారంభించామన్నారు. ఫ్యాషన్‌, గార్మెంట్‌ పరిశ్రమల్లో రాణించాలనుకునేవారికి కోర్సు ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. ఈ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులు.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, ప్రవేశ పరీక్ష ద్వారా సీట్లు కేటాయిస్తామని తెలిపారు. పూర్తి సమాచారం కోసం ఠీఠీఠీ.్టటఠీట్ఛజీట.్చఛి.జీుఽ వెబ్‌సైట్‌ను సందర్శించాలని రోనాల్డ్‌ రోస్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - 2022-08-04T10:01:46+05:30 IST