మోదీని సీఎం కేసీఆర్ ఎందుకు ప్రశ్నించరు: Jaggareddy
ABN , First Publish Date - 2022-07-01T04:18:47+05:30 IST
ఢిల్లీ (Delhi) వెళ్లి ప్రధాని మోదీ (Pm Modi)ని ప్రశ్నిస్తానన్న సీఎం కేసీఆర్ (Cm Kcr)... ఇక్కడకు వస్తున్నా ఎందుకు నిలదీయడం లేదని...
హైదరాబాద్ (Hyderabad): ఢిల్లీ (Delhi) వెళ్లి ప్రధాని మోదీ (Pm Modi)ని ప్రశ్నిస్తానన్న సీఎం కేసీఆర్ (Cm Kcr)... ఇక్కడకు వస్తున్నా ఎందుకు నిలదీయడం లేదని కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Mla Jaggareddy) అన్నారు. మోదీ పర్యటనపై కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఎందుకు కార్యాచరణ ప్రకటించడం లేదని.. సీఎం కేసీఆర్కు ఈడీ నోటీసులు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. మోదీ రాకపై నిరసనలు తెలిపేందుకు కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. మోదీ, కేసీఆర్ మోసాలపై ఫ్లెక్సీలు పెట్టి నిరసన తెలుపుతామని జగ్గారెడ్డి తెలిపారు.